తెలంగాణలో మందు బాబులకు మరో గుడ్‌న్యూస్

తెలంగాణలో మందుబాబులకు సర్కారు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. లిక్కర్ బ్రాండ్ల కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్రంలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై తెలంగాణ ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనుంది. తెలంగాణలోకి కొత్తగా ప్రవేశించే ఆయా కంపెనీలు.. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ దరఖాస్తోపాటు సెల్ఫ్ సర్టిఫికేట్ జతపరచాలని టీజీబీసీఎల్ స్పష్టం చేసింది.

Government invites new liquor brands in Telangana

తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తును విక్రయించేందుకు ఇటీవల టీజీబీసీఎల్ కొందరికి అనుమతులు ఇచ్చింది. కానీ, కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో పలు షరతులతో కొత్త మద్యం కంపెనీలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం టీజీబీసీఎల్‌కు స్పష్టం చేసింది. టీజీీసీఎల్ తెలంగాణలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రకటన జారీ చేసింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తలను 10 రోజులపాటు ఆన్‌లైన్ పెట్టాలని టీజీబీసీఎల్ నిర్ణయించింది. దరఖాస్తులులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపిన అనంతరం అనుమతులపై నిర్ణయం తీసుకోనుంది. టీజీబీసీఎల్ లో నమోదై సరఫరా చేస్తున్న సప్లయర్స్ మాత్రం ప్రస్తుతం న్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+