సిటీ జనులకు జీహెచ్ఎంసీ ఆఫర్!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటీఎస్ పథకాన్ని ఉపయోగించుకుని నగరంలోని ఆస్తి పన్ను మొండి బకాయిలున్న వారు పన్ను చెల్లించాలని సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటీఎస్‌లో మొత్తం పన్నుతోపాటు వడ్డీ 10శాతం చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ ఈసారి ఆస్తి పన్నుకు సంబంధించి రూ. 2 వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఓటీఎస్‌కు అంగీకరించడంతో ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవుతాయని జీహెచ్ఎంసీ భావిస్తోంది. కాగా, గత ఏడాది ప్రవేశపెట్టిన ఓటీఎస్ వల్ల సుమారు లక్ష మంది వినియోగదారులు ఆస్తి పన్ను చెల్లించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆస్తి పన్ను బకాయిలు రూ. 4 వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రూ. 3 వేల కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ. 1000 కోట్లు సుమారు 2 లక్షల మంది నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సి ఉంది. పెండింగ్ బకాయిలకు వడ్డీ కలిపితే రూ. 2,500 కోట్ల వరకు అవుతోంది. ఈ క్రమంలోనే ఓటీఎస్ ద్వారా వడ్డీని 90 శాతం తగ్గించి పన్ను బకాయిలను రాబట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications