టీఎస్పీఎస్సీ: 'తొలి నోటిఫికేషన్ నా శాఖదే'(ఫోటోలు)

హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధించడంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ది (టీఎస్పీఎస్సీ) కీలక పాత్ర అని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. రాజ్‌భవన్‌లో శనివారం టిఎస్‌పిఎస్సీ లోగో, వెబ్‌సైట్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత తమకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు.

వారి ఆశలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు. టీఎస్పీఎస్సీ ప్రారంభించిన వెబ్‌సైట్ కేవలం ఉద్యోగ ఖాళీల భర్తీకే పరిమితం కాకుండా, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించే విధంగా ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు.

ఇక దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోని పిఎస్సీలను అధ్యయనం చేసి నిరుద్యోగుల కోసం అత్యుత్తమ వెబ్‌సైట్ రూపొందించినట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రి కె తారకరామారావు హాజరై టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి జారీ చేయబోయే తొలి నోటిఫికేషన్ తన శాఖకు సంబంధించిందేనని వెల్లడించారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

వచ్చే రెండేళ్లలో వివిధ శాఖల్లో లక్షా ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

టిఎస్‌పిఎస్సీ వెబ్‌సైట్‌లో నిరుద్యోగుల వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ టిఎస్‌పిఎస్సీ ఉద్యోగాల భర్తీకి జారీ చేయబోయే తొలి నోటిఫికేషన్ తన గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిందే కావడం ఆనందంగా ఉందన్నారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

ఉద్యోగార్థులు తమ అర్హతలను వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌లో నమోదు చేసుకుంటే వారికి ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలు ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా అందుతాయని మంత్రి స్పష్టం చేశారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

ఉద్యోగాల ఖాళీల భర్తీపట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత పాత్ర ఎంతో కీలకమని, వారందరికీ న్యాయం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి కెటిఆర్ అన్నారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

ఈ సందర్భంగా టిఎస్‌పిఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ఈనెల 14 నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేస్తామన్నారు. పిఎస్సీ కార్యాలయంలో తెలంగాణ పిఎస్సీ కోసం రెండు ఫ్లోర్లను కేటాయించాలని ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

దేశంలోని పలు రాష్ట్రాల పిఎస్సీలు నిర్వహిస్తున్న వెబ్‌సైట్లను అధ్యయనం చేసి అత్యుత్తమైన వెబ్‌సైట్‌ను రూపొందించామని, దీనిద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని ఘంటా చక్రపాణి వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతోపాటు టిఎస్‌పిఎస్సీ సభ్యులు పాల్గొన్నారు

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి యువతకు భాగస్వామ్యం కల్పించి, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీపైనే ఉందని గవర్నర్ గుర్తు చేశారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

వారి ఆశలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు. టీఎస్పీఎస్సీ ప్రారంభించిన వెబ్‌సైట్ కేవలం ఉద్యోగ ఖాళీల భర్తీకే పరిమితం కాకుండా, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించే విధంగా ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

ఇక దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోని పిఎస్సీలను అధ్యయనం చేసి నిరుద్యోగుల కోసం అత్యుత్తమ వెబ్‌సైట్ రూపొందించినట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు.

 తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

తొలి నోటిఫికేషన్ నా శాఖదే: కేటీఆర్

కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రి కె తారకరామారావు హాజరై టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి జారీ చేయబోయే తొలి నోటిఫికేషన్ తన శాఖకు సంబంధించిందేనని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+