అపద్ధర్మ సీఎం వద్దు: విపక్షాలకు 11న గవర్నర్ అపాయింట్‌మెంట్, ‘పొత్తులపై టీపీసీసీ కమిటీ’
హైదరాబాద్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ అఖిల పక్షానికి సెప్టెంబర్ 11న అపాయింట్‌మెంట్ ఇచ్చారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఎల్ రమణ అపాయింట్‌మెంట్ అడిగిన విషయం తెలిసిందే.
ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌ను కొనసాగించొద్దని గవర్నర్‌కు విన్నపం చేయనున్నాయి విపక్షాలు. అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం 4గంటలకు విపక్ష నేతలు గవర్నర్‌ను కలవనున్నాయి.

పొత్తులపై టీపీసీసీ కమిటీ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. పొత్తులపై చర్చలకు గాను టీ-పీసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
Recommended Video

ఈ కమిటీలో టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో పీసీసీ కమిటీ సమావేశం కానున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications