తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై: గోల్కొండ కోటలో సీఎస్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. అనాడు స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా పోరాడిన మహనీయుల ధైర్యాన్ని, వారి త్యాగాలను, పోరాట పటిమను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 15కి ప్రత్యేకత ఉందని గవర్నర్ చెప్పారు.

ఈ ఏడాది అమృత్ కాల్ మొదటి సంవత్సరాన్ని సూచిస్తుందని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈ మహత్తర ఉద్యమంలో మెరుగైన భారతదేశాన్ని నిర్మించడానికి దేశ ప్రజలందరం కలిసి కృషి చేద్దామంటూ గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలని, మహిళా సాధికారతకు, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం కలిసి కృషి చేయాలని కోరారు. ఇవన్నీ చేసినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతమవుతుందన్నారు.

governor tamilisai soundararajan congratulated the people of telangana on Independence day

గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు

గోల్కొండ కోట‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి సోమ‌వారం ప‌రిశీలించారు. వేదిక‌తో పాటు వేడుక‌లు నిర్వ‌హించే ప్రాంతాల్లో క‌లియ‌తిరిగిన సీఎస్ అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌ల‌ను పురస్కరించుకుని అధికారులంతా సమన్వయంతో పనిచేసి, తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

బ్లూ బుక్‌ ప్రకారం పోలీసుశాఖ తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్‌ మళ్లింపుల సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేయాలన్నారు. ట్రాఫిక్‌ నిర్వహణ, విద్యుత్తు, సీటింగ్‌, నీటి సరఫరా, పారిశుద్ద్యం, వైద్యసేవలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి‌ పరిశీలించారు.

వేడుకలు సజావుగా నిర్వహించేందుకు, వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జీఏడీ అధికారులు సీఎస్‌కు వివరించారు. ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు, ఆర్‌అండ్‌బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, జీహెచ్‌ఎంసీ కమిషన్‌ రోనాల్డ్‌రోస్‌, జలమండలి ఎండీ దానకిషోర్‌, ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 15న ఉదయం గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+