రుణమాపీ నిధులు అందలేదా - ప్రభుత్వం కీలక ప్రకటన..!!

రైతు రుణమాఫీ రెండో విడత పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ 2 లక్షల వరక రైతు రుణాలను ఆగస్టు 15లోగా మాఫీ చేయాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకనే క్రమంలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రూ లక్ష వరక రుణాల మాఫీకి నిధులు విడుదల చేసింది. రెండో విడతకు ఇప్పుడు సిద్దమయింది. నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయటం గురించి ఆర్దిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

రుణమాఫీ నిధులు
రుణమాఫీ రెండో విడతలో భాగంగా రూ 1.50 లక్షల వరకు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. వచ్చే వారం రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ మేరకు అధికారులకు సూచనలు చేసారు. తొలి విడతలో లక్ష రూపాయాల వరకు రుణం మాఫీ చేసారు. సాంకేతిక సమస్యల కారణంగా కొందరు రైతుల ఖాతాల్లో పూర్తిగా నగదు జమ కాలేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. దీని పైన మంత్రి తుమ్మల స్పష్టత ఇచ్చారు.

Govt all set to clear Seond phase Loan waiver funds in farmers accounts

ప్రభుత్వమే నేరుగా
మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతులకు మాఫీ చేయాలని భావించినా కొందరు రైతుల ఖాతాలకు టెక్నికల్ సమస్యలు రావడంతో సాధ్యం కాలేదన్నారు. రుణమాఫీ డబ్బులు రిజర్వ్ బ్యాంకుకు చెందిన ఈ-కుబేర్ విధానం ద్వారా జమ అవుతున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 84.94 కోట్ల రూపాయలు 17 వేల 877 లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. ఆ నిధులు ఆర్బీఐ దగ్గరే ఉండిపోయాయని తెలిపారు. టెక్నికల్ సమస్యలను సవరించిన తర్వాత ఆర్బీఐ నుంచి డబ్బులు తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి తుమ్మల వివరించారు.

నిధుల జమ
కొద్దిమంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, గ్రామీణ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారని.. వాటికి ఆర్బీఐతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి స్పష్టం చేసారు. తెలిపారు మంత్రి తుమ్మల. ఇప్పటికే లబ్ధిదారుల వివరాలను బ్యాంకుల నుంచి తెప్పించామనన్నారు. మొత్తం 15 వేల 781 ఖాతాలు ఉన్నట్లు తేలిందన్నారు. వాటి తనిఖీ దాదాపు పూర్తయిందని.. ఒకటి రెండు రోజుల్లో ఆ ఖాతాల్లో కూడా ఫస్ట్ ఫేజ్ రుణమాఫీ నిధులను జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+