ఫలించిన రైతుల నిరీక్షణ, ఎట్టకేలకు ఖాతాల్లో నిధుల జమ..!!
రైతుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. వారి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకే నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు రైతుల నుంచి భూములు సేకరించారు. సుదీర్ఘ కాలంగా వారంతా తమకు చెల్లించాల్సిన పరిహారం కోసం వేచి చూస్తున్నారు. కాగా.. ఇప్పుడు వారి ఖాతాల్లో పరిహారం కింద నిధులు జమ అయ్యాయి.
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన భూములను రైతుల నుంచి సేకరించింది. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎట్టకేలకు పరిహారం పంపిణీ ప్రారంభమైంది. దీంతో రైతులు తమ ఖాతాలను చూసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే పరిహారం జమ అవుతుందని అధికారులు అంటున్నారు. ఉత్తర భగం నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రావడంతో అధికారులు గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేశారు. దీంతో పరిహారం డబ్బులు పంపిణీకి NHAIకి మార్గం సుగమం అయింది. చౌటుప్పల్, భువనగిరి, జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి కంది వరకు 158 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.5557.02 కోట్ల వ్యయం చేయనున్నారు.

మొదటి విడత పరిహారానికి రెండింతలు పెంచి రెండో విడతలో తుది మొత్తాన్ని జిల్లా కలెక్టర్ ఖరారు చేయనున్నారు. నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాక భూముల దస్తావేజులను సేకరించనున్నారు. ఎకరాకు రూ.14 నుంచి రూ.16 లక్షలు అందుతాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిర్వాసితుల ఖాతాల్లో ఎకరాకు రూ.14 నుంచి రూ.16 లక్షల వరకు భూములు మార్కెట్ విలువ ఆధారంగా డబ్బులు జమ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్బిట్రేషన్ దరఖాస్తులు కలెక్టర్ ఆమోదానికి పంపిన తర్వాత అక్కడి నుంచి రెండో విడతలో ఎకరా భూమికి రూ.30 లక్షల వరకు అందజేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో.. సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న రైతులకు ఫలితం దక్కింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications