హైదరాబాద్ సిటీ ప్రయాణికులకు TGSRTC శుభవార్త: T-24 టికెట్ల ఛార్జీ తగ్గింపు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ప్రతి దసరా, సంక్రాంతి పండగ సీజన్‌లల్లో దీన్ని అమలు చేస్తోంది. తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. అదే సమయంలో హైదరాబాద్ లో కొత్త సిటీ బస్సులను నడిపిస్తోంది. నగర పరిధి భారీగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతోంది.

దీన్ని మరింత విస్తరించనుంది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసింది టీజీఎస్ఆర్టీసీ. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉన్న 2,800 డీజిల్ బస్సులను తొలగించాలని నిర్ణయించింది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. దశలవారీగా ఈ కార్యక్రమం చేపడుతుంది టీజీఎస్ఆర్టీసీ. వచ్చే రెండేళ్లల్లో అంటే.. 2027 నాటికి ఈ 2,800 డీజిల్ బస్సులన్నీ కూడా కనిపించవు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Grab T24 Tickets in Hyderabad TGSRTC City Buses at Discounted Fares Till Dec 31

ఈ క్రమంలో మరో ఆఫర్ ను ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ. ట్రావెల్ యాజ్ యు లైక్.. టీ24 టికెట్ల రేట్లను తగ్గించింది. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు వర్తిస్తుంది. ప్రస్తుతం టీ24 టికెట్ ధర పెద్దలకు 150 రూపాయలు, మహిళలు, సీనియర్ సిటిజన్లకు 120 రూపాయలు, పిల్లలకు 100 రూపాయలను వసూలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఛార్జీలను తగ్గిస్తూ టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

దీని ప్రకారం- పెద్దలకు 130 రూపాయలు, మహిళలు- సీనియర్ సిటిజన్లకు 110 రూపాయలు, పిల్లలకు 90 రూపాయలుగా నిర్ధారించారు. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ టికెట్లతో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

క్రిస్మస్, కొత్త సంవత్సరం పండగలు, సెలవుల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి ఛార్జీలను తగ్గించారు. ఈ సీజన్ లో పొరుగు జిల్లాలతో పాటు ఏపీ నుంచీ పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కు తరలివస్తారని, ఈ తగ్గింపు వల్ల వారికి లబ్ది కలుగుతుందని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+