బంగారంతో తయారు చేయించిన పట్టుచీర,డ్రైప్రూట్స్ తో పెళ్ళిపత్రికలు, హైద్రాబాద్ లో అంగరంగవైభవంగా పెళ్ళి
హైద్రాబాద్ ముషీరాబాద్ లోని కాంగ్రెస్ నాయకుడు శంకర్ తన కొడుకు గణేష్ వివాహనికి గాలి జనార్థన్ రెడ్డి కూతురు వివాహం కోసం చేసినట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. వెడ్డింగ్ కార్డు బాక్స్ లో వివాహం, రిసెప్షన్
హైదరాబాద్ :కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వివాహం మరువక ముందే అదేస్థాయిలో హైద్రాబాద్ లో ఓ కాంగ్రెస్ నాయకుడు తన కొడుకు వివాహం గురువారం నిర్వహించనున్నారు. గాలి జనార్థన్ రెడ్డి కూతురు వివాహ పత్రిక తరహలోనే హైద్రాబాద్ కాంగ్రెస్ నాయకుడు కూడ తన కొడుకు వివాహ పత్రికను ముద్రించారు.
మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహ పత్రిక వెరైటీగా ముద్రించారు. ఈ పత్రికే పెద్ద సంచలనంగా మారింది. పత్రికతో పాటు వివాహ వేడుకలను కూడ అంతే ఘనంగా ఆయన నిర్వహించారు.ఇదే తరహలో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రం శంకర్ తన కొడుకు గణేష్ వివాహ వేడుకలను నిర్వహిస్తున్నారు.

గాలి జనార్థన్ రెడ్డి రూపొందించినట్టుగానే గుర్రం శంకర్ కూడ తన కొడుకు వివాహ ఆహ్వానపత్రికను రూపొందించారు.బోయినపల్లిలోని ఆశోక గార్డెన్స్ లో ఈ వివాహం గురువారం నాడు జరగనుంది.వివాహ ఆహ్వనం కోసం పత్రికలు కూడ అంతే స్థాయిలో ఉన్నాయి.
గాలి జనార్థన్ రెడ్డి తయారుచేయించినట్టుగానే వెడ్డింగ్ బాక్స్ ను తయారు చేయించారు. ఈ బాక్స్ తెరవగానే పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు వివరాలు వస్తాయి. వివాహం ఎప్పుడు , రిసెప్షన్ ఎప్పుడు అనే వివరాలు తెలుస్తాయి.బాక్స్ లో అడుగుబాగాన నాలుగు రకాల డ్రై ప్రూట్ బాక్స్ ను ఇచ్చారు. పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురు వివాహం రోజున ధరించే దుస్తులను డిల్లీలో డిజైనర్లు వీటిని తయారు చేశారు.పెళ్ళి కుమార్తె ధరించే చీరకు బంగారం కోటింగ్ తో నగిషీలు అద్దారు. ఈ వివాహనికి రాజకీయ ప్రముఖులు ,సినీ తారలు హాజరుకానున్నారు.
-
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications