బీఆర్‌ఎస్‌కు మోక్షం!: క్రమబద్దీకరణ ప్రాసెసింగ్‌కు గ్రీన్ సిగ్నల్
వరంగల్: వరంగల్ మహానగర ప్రజలకు శుభవార్త. ఏడు నెలలుగా ఎదురు చూస్తున్న అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్‌ఎస్) అమలు చేసేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో కొంత సడలింపు కల్పించింది.
బీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి. తొలుత అనర్హత కలిగిన వారిని తిరస్కరిస్తున్నట్లుగా ప్రత్యేక నోటీసులు ఇవ్వాలి. తర్వాత అర్హత కలిగిన దరఖాస్తుల క్రమబద్ధీకరణకు తగిన ఏర్పాట్లు చేయాలి. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు క్రమబద్దీకరణ చేసినట్లుగా అధికారిక ప్రొసిడింగ్ కాపీలను ఆపాలని హైకోర్టు సూచించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సర్వం సిద్ధమైంది.
గత కొన్ని నెలలుగా చాలా మంది దరఖాస్తుదారులు బల్దియా కార్యాలయం చుట్టూ ఈ విషయమై తిరుగుతున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తొలగడంతో క్రమబద్ధీకరణపై గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ టైన్ ప్లానింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు.

7,992 దరఖాస్తులు
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్‌ఎస్)ను అమల్లోకి తెచ్చింది. 02-11- 2015 నాడు రాష్ట్ర పురపాలక శాఖ జీవో నంబర్ 152ను విడుదల చేసింది. ఐదు నెలల పాటు వరంగల్ మహా నగర ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్‌ఎస్ పథకం కోసం గత మార్చి 31 తేదీ నాటికి మొత్తం 7,992 దరఖాస్తులు వచ్చాయి. ఫీజుల రూపేణా రూ. 7.27 కోట్ల ఆదాయం లభించింది.
కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఉన్న డివిజన్ల నుంచి అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం బీఆర్‌ఎస్ పథకం ద్వారా 2,609 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో చాలా వరకు మధ్యతరగతి వర్గాలకు చెందిన వారి నుంచే దరఖాస్తులు వచ్చాయి. కొన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.
కాజీపేట సర్కిల్ కార్యాలయం పరిధిలో అనధికారికి నిర్మాణాల క్రమబద్ధీకరణకు బీఆర్‌ఎస్ ద్వారా 4,794 దరఖాస్తులు వచ్చాయి. అపార్టుమెంట్లు, బడా భవనాలు, షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్య భవనాలపై అనుమతి లేకుండా అదనపు నిర్మాణాలు చేప్టారు. వీటిని బీఆర్‌ఎస్ ద్వారా సక్రమం చేసుకోవాలని బిల్డర్లు, ఆయా భవన యజమానులు ఎదురు చూస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బీఆర్‌ఎస్ కోసం 409 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువ శాతం బడా భవనాలే ఉన్నాయి. వీటన్నింని 58 డివిజన్ల వారీగా విభజన చేస్తున్నారు.
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే..
బీఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ పాత మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారమే చేస్తారని సమాచారం. 2013లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నూతన మాస్టర్‌ప్లాన్ తయారు చేసినప్పికీ మూడేళ్లు గడిచినా ఇంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. 1972లో రూపొందించిన వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ నిబంధనలే ఇంకా అమలవుతున్నాయి.
రూ. 30 కోట్ల ఆదాయం..
బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్‌ఎస్) ద్వారా మహా నగరపాలక సంస్థకు కాసులు పంట పండనుంది. మహా నగరంలో 58 డివిజన్ల నుంచి 7,982 దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక ఫీజుల ద్వారా రూ. 7.27కోట్ల ఆదాయం లభించింది. బీఆర్‌ఎస్ దరఖాస్తుల్లో అర్హత ఉన్న వారిని క్రమబద్దీకరణ చేస్తే తక్షణం రూ. 30 కోట్ల ఆదాయం లభించే అవకాశాలున్నాయి.
డివిజన్ల వారీగా పరిశీలన:
బీఆర్‌ఎస్ పథకం ద్వారా 7,992 దరఖాస్తులు వచ్చాయి. వారిని మహా నగరంలోని 58 డివిజన్ల వారీగా విభజన చేశాం. కాశీబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల వారీగా దరఖాస్తుల వివరాలన్నీ కంప్యూటర్‌లో నమోదు చేశాం. రాష్ట్ర మున్సిపల్ శాఖ జారీ చేసే నిబంధనల ప్రకారం బీఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్దీకరణకు సిద్ధమవుతున్నాం. డివిజన్ల వారీగా దరఖాస్తులను విభజించి క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలిస్తాం. ఇందు కోసం టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బందిని బృందాలుగా నియమిస్తాం అని ఎం. రాజేంద్ర ప్రసాద్‌నాయక్, సిటీ ప్లానర్, గ్రేటర్ తెలిపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications