Group-1: దయ లేదా.. దివ్యాంగురాలి ఆవేదన కనిపించలేదా..!
One India Telugu Exclusive: ఎట్టకేలకు రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం అయ్యాయి. అయితే దివ్యాంగురాలు రిపోర్టింగ్ టైమ్ కంటే 8 నిమిషాలు లేటు వచ్చిందని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. చెవుడు, మూగ అయన ఆమె అధికారులను ఎంత వేడుకున్నా కణికరించలేదు. హైదరాబాద్ బేగంపేటలోని మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ సెంటర్ పడింది. గద్వాల జిల్లాకు చెందిన లతమ్మకు చెవుడు, మూగ. అ పై పేదరికం.
పేదరికం, చెవుడు, మాట్లాడకపోయినా ఆమె కష్టపడి చదివారు. డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ఎంతో కష్టపడి గ్రూప్-1 దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ రాశారు.మెయిన్స్ కు అర్హత సాధించారు. ఆమెకు బేగంపేటలోని మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెంటర్ పడింది. దీంతో ఆమె తన భర్తతో కలిసి సోమవారం ఉదయం రైలుకు బయల్దేరడానికి వచ్చింది. కానీ ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె రిపోర్టింగ్ టైమ్ కంటే 5 నిమిషాలు లేటు వచ్చినట్లు చెబుతోంది. ఆమె, ఆమె భర్త అధికారులను వేడుకున్నా కనికరించలేని ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటలు కాగా అభ్యర్థులంతా ఒంటి గంట 30 నిమిషాలకే సెంటర్ కు చేరుకోవాలి. కానీ లతమ్మ 5 నిమిషాలు ఆలస్యంగా అంటే ఒంటి గంట 35 నిమిషాలకు వచ్చింది. దీంతో ఆమె పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది. దీనిపై మీడియా ప్రతినిధులు, అక్కడున్న వారు పోలీసులను రిక్వెస్ట్ చేయగా.. వాళ్లు 8 నిమిషాలు లేటుగా వచ్చారని.. మేం ఏం చేయాలేమని చెప్పారు. అయితే లతమ్మ మాత్రం తనకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని వేడుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె కళ్లు తిరిగి కింద పడిపోయారు.
దివ్యాంగురాలైనా దయతలచకపోవడంపై అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గ్రూప్-1 వాయిదా వేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లిన అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. తాము ఈ సమయంలో జోక్యం చేసుకోలేని స్పష్టం చేసింది. కాగా అభ్యర్థులు జీవో నంబర్ 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో నంబర్ 55 ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ ముందుకెలళ్లింది.












Click it and Unblock the Notifications