తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల: 783 పోస్టులకు 18 నుంచి అప్లై చేసుకోవచ్చు

హైద‌రాబాద్: తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు ఇది శుభ‌వార్తే. తాజాగా, 783 పోస్టుల భర్తీకి గ్రూప్ -2 నోటిఫికేష‌న్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. జ‌న‌వ‌రి 18 నుంచి అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in సంప్రదించవచ్చు.

టీఎస్‌పీఎస్సీ రెండు కొత్త నోటిఫికేషన్లు: 276 పోస్టులు

విద్య, వ్యవసాయ శాఖలో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంటర్ విద్యాశాఖలో 91, సాంకేతిక విద్యాశాఖలో 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, వ్యవసాయ శాఖలో 148 వ్యవసాయాధికారుల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

 group-2 notification released in telangana for 783 posts

ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 01-07-2022 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తులను జనవరి 6, 2023 నుంచి జనవరి 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.

అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో జనవరి 10 నుంచి జనవరి 30, 2023, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
సాంకేతిక విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్‌ : 37
ఇంటర్మీడియట్‌ విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్‌ : 91
మొత్తం : 128
అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులు మల్టీజోన్‌ -1 : 100
మల్టీజోన్‌ -2 : 48
మొత్తం : 148.

మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+