జూబ్లీహిల్స్‌లో కర్నాటక దొంగల కాల్పుల కలకలం, అరెస్ట్
హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని నీరుస్ షోరూం వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయి. కాల్పులు జరగడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
పోలీసులు దుండగుడిని పట్టుకున్నారు. అతనిని స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అతనిని విచారిస్తున్నారని తెలుస్తోంది.
కాల్పులకు పాల్పడిన వ్యక్తి బైక్ పైన వచ్చాడు. అతను దొంగ అని గుర్తించిన పోలీసులు అతనిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు.. అతను తుపాకీతో ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. అతనిని పట్టుకున్నారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు.

ఐదు రోజుల క్రితమే...
కర్నాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఐదు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారని, బ్యాంకులను లక్ష్యంగా చేసుకొని భారీ దోపిడీకి ప్లాన్ చేసుకున్నారని పోలీసులకు సమాచారం ఇదివరకే అందిందని తెలుస్తోంది.
వారు గుల్బర్గా నుంచి వచ్చారు. వచ్చిన ముగ్గురు గురువారం మధ్యాహ్నం నీరుస్ సమీపంలో ఉన్నారని తెలుసుకొని పోలీసులు పట్టుకునేందుకు వచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో కాల్పులు జరిగాయని చెబుతున్నారు. ఇద్దరి తప్పించుకోగా, ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కాల్పుల ఘటనలో ఎల్ అండ్ టికి చెందిన ఓ ఉద్యోగికి గాయాలయ్యాయి.
కాల్పులు జరిపింది కర్నాటకవాసులు, ముగ్గురి అరెస్ట్
కాల్పులు జరిపింది కర్నాటక దొంగలుగా పోలీసులు గుర్తించారు. మొదట ఒక దొంగను పట్టుకున్న పోలీసులు ఆ తర్వాత ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కర్నాటకకు చెందిన ఆ దొంగలు షహీన్ మీర్జా, అబ్దుల్ సత్తార్, ఖాదర్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి ధర్మేంద్ర. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications