(ఫోటోలు) రాజకీయం కాదు: గుండు సుధారాణిపై కెసిఆర్, బాబు ఆదేశంతో ఝలక్!

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి శనివారం నాడు టిఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరుల సమక్షంలో ఆమె కారు ఎక్కారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోయేందుకు రాజకీయ శక్తులన్నీ ఒకేతాటి పైకి రావాలని ఈ సందర్భంగా కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకే సుధారాణి టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు.

వరంగల్ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దేశంలోకెల్లా అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు జిల్లాలో స్థాపిస్తున్నట్లు తెలిపారు. ఇది రాజకీయ చేరిక కాదని, తెలంగాణ శక్తుల ఏకీకరణ అని కెసిఆర్ అభివర్ణించారు.

 గుండు సుధారాణి

గుండు సుధారాణి

గుండు సుధారాణి ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ప్రజాసమస్యలపై పోరాటం చేశారని, ఆమె తనకు ఇరవై ఏళ్లుగా తెలుసునని సీఎం కెసిఆర్ చెప్పారు.

గుండు సుధారాణి

గుండు సుధారాణి

పాత, కొత్త అనే తేడాలేకుండా అందరినీ కలుపుకొని పోవాలని వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, నాయకులకు కెసిఆర్ సూచించారు.

గుండు సుధారాణి

గుండు సుధారాణి

గుండు సుధారాణితో పాటు వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుండు ప్రభాకర్, వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు కారు ఎక్కారు.

గుండు సుధారాణి

గుండు సుధారాణి

సీనియర్ టీడీపీ నాయకులు తాటికొండ ఓంకార్, బయ్యస్వామి, గుండు పూర్ణచందర్, ఒడ్నాల నరేందర్, ఒగ్గుశెట్టి అనిల్, రామచందర్, సాగర్ల శ్రీను, పొలెపాక నరేందర్, విన్నారం దయాకర్, విజయ్, తదితరులు సుధారాణి వెంట సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

 గుండు సుధారాణి

గుండు సుధారాణి

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు కే కేశవరావు, వినోద్ కుమార్, మంత్రులు చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, ఆరూరి రమేశ్, స్టీఫెన్‌సన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుండు సుధారాణి

గుండు సుధారాణి

కాగా, అంతకుముందే తెలుగుదేశం పార్టీ గుండు సుధారాణిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ ప్రకటించారు.

గుండు సుధారాణి

గుండు సుధారాణి

టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఎల్ రమణ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+