పదవుల పంట: గుండు సుధారాణికి జోడు పదవులు
ఓరుగల్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో పదవుల పంట పండింది. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటించిన నియమిత పదవుల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం లభించింది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి చెందిన
వరంగల్: ఓరుగల్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో పదవుల పంట పండింది. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటించిన నియమిత పదవుల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం లభించింది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి చెందిన మాజీ ఎంపీ గుండు సుధారాణికి జోడు పదవులు వచ్చాయి.
తెరాస రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా, ఉమెన్ కో'ఆపరేటీవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు గిర్నీతండాకు చెందిన గాంధీనాయక్‌కు తెలంగాణ రాష్ట్ర గిరిజన కో'ఆపరేటీవ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు.

జయశంకర్‌భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామానికి చెందిన కె.వాసుదేవరెడ్డిని రాష్ట్ర వికలాంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించారు. ఈమేరకు సోమవారం సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. తెరాస అధికార పగ్గాలు చేపట్టిన మూడేళ్లలో ఇప్పటి వరకు ప్రకటించిన నియమిత పదవుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకే కేసీఆర్ పెద్దపీట వేశారు.
గతంలో రాష్ట్ర పౌరసరఫరాల విభాగం ఛైర్మన్‌గా పెద్ది సుదర్శన్‌రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కన్నెబోయిన రాజయ్యయాదవ్, పర్యాటక సంస్థ ఛైర్మన్‌గా పేర్వారం రాములు, టీఆగ్రోస్ ఛైర్మన్‌గా లింగంపల్లి కిషన్‌రావు, రాష్ట్ర స్థాయి ఛైర్మన్లుగా బొల్లం సంపత్‌కుమార్, మౌలానా యూసుఫ్ జావీద్‌లకు పదవులు దక్కాయి. తాజాగా ముగ్గురికి రావడంపై ఓరుగల్లులో సంబరాలు అంబరాన్నంటాయి.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications