నేను రాజీనామాకు సిద్ధం: కోమటిరెడ్డికి ఎంపీ గుత్తా సవాల్
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే.. తాను కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. నల్గొండలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా నల్గొండ జిల్లా బునాదిగాని కాల్వ, పిల్లాయి కాల్వ ఆధునికీకరణ పనుల కోసం 285 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

నల్గొండ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్‌పై మతి భ్రమించినట్టు కోమటిరెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications