Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెసుకు పెద్ద దెబ్బ: టిఆర్ఎస్‌లోకి గుత్తాతో పాటు ఎమ్మెల్యే..

నల్లగొండ: కాస్తా బలంగా ఉన్న నల్లగొండ జిల్లాలో కాంగ్రెసు పార్టీకి భారీ షాక్ తగలనుంది. పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు శాసనసభ్యుడు భాస్కర రావుకు త్వరలో కారెక్కడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి హరీశ్‌ రావుతోపాటు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో గుత్తా చర్చలు జరిపినట్లు తెలిసింది.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కెసిఆర్‌పైనా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. పార్లమెంట్‌ కార్యదర్శుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వారిని ప్రభుత్వం తొలగించాల్సి వచ్చింది.

గుత్తా

శుక్రవారం నల్లగొండలో జరిగిన మీడియా సమావేశంలో గుత్తా స్వరం మార్చారు. దీన్ని బట్టి ఆయన టిఆర్ఎస్‌లో చేరుతారనే చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఆయన సానుకూల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకోవడంపై అభ్యంతరం చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.

గత నెల 19నమంత్రి హరీశ్‌ రావు నాగార్జునసాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. అప్పట్లో మంత్రులు హరీశ్‌, జగదీశ్‌ రెడ్డిల కారులోనే ఎంపీ గుత్తా కూడా ప్రయాణించారు. అప్పుడే పార్టీ మార్పుపై చర్చ జరిగింది. రెండు రోజుల కిందట కెసిఆర్ ‌ను ఆయన కలిశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే భాస్కరరావు కూడా ఉన్నారు.

అయితే, సంక్షేమ పథకాల అమలు గురించే తాము ముఖ్యమంత్రిని కలిశామని గుత్తా చెప్పారు. కానీ వారి మధ్య రాజకీయ చర్చ సాగినట్లు సమాచారం. టీఆర్‌ఎ్‌సలోకి వెళ్తే ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసే ప్రమాదం ఉందని భావించటం వల్ల పార్టీ మార్పుపై ఎంపీ గుత్తా మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.

రాజ్యసభ పదవి ఇస్తే టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లటానికి ఆసక్తి కనబరచినా, ఆ పదవులు ఇతరులను వరించటంతో గుత్తా వెనక్కు తగ్గినట్లు తెలిసింది. అయితే, టీఆర్‌ఎస్‌ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో ఇద్దరూ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలోనే గులాబీ గూటికి చేరనున్నారని వార్తలు వచ్చాయి.

దీన్ని బట్టి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. 'మీరు కూడా టీఆర్‌ఎ్‌సలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది' అని మీడియా ప్రశ్నించినప్పుడు గుత్తా ఖండించలేదు, అవునని కూడా అనలేదు. రేపు ఏం జరగనుందో!? భవిష్యత్‌ గురించి ఆలోచన లేదని అని నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+