సరదా కోసం సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నాడు
స్నేహితుల సామాజిక మాథ్యమాలను సరదాగా హ్యక్ చేసి....వారికే యూజర్ ఐడి, పాస్ వర్డ్ లను పంపే అలవాటున్న విక్రాంత్ రెడ్డి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సరూర్ నగర్ కు చెందిన ఓ యువతి సైబర్ క్ర
హైదరాబాద్ :ఉన్నతవిద్య చదివాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. సరదా కోసం హ్యకింగ్ చేయడం మొదలుపెట్టాడు. స్నేహితుల సామాజికమాథ్యమాల అకౌంట్లను హ్యక్ చేసి వారి యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను వారికే పంపేవాడు. ఓ విధ్యార్థిని ఫిర్యాదుతో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. సరదా కోసం చేసిన పని అని తేల్చడంతో ఆయనను వదిలేశారు.
హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ కు చెందిన విక్రాంత్ రెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. చిన్నప్పటి నుండి చదువుతో పాటు అన్ని విషయాల్లోనూ ఆయన అన్నింటా ముందుండే వాడు. అయితే స్నేహితులు, తనకు తెలిసిన వారి ఫేస్ బుక్ లు, ఇతర సామాజిక మాథ్యమాల అకౌంట్లను తెరిచి చూడడం చాల ఇష్టం.

ఫిషింగ్ మెయిల్ ను పంపి సోషల్ మీడియా అకౌంట్లను హ్యక్ చేయడం సులువని తెలుసుకొన్నాడు. సరదాగా తన స్నేహితుల అకౌంట్లను హ్యాక్ చేసేవాడు. వారి యూజర్ నేమ్ , పాస్ వర్డ్ లను వారికే పంపేవాడు. ఈ పిచ్చి బాగా ముదిరింది.చివరికి అమ్మాలయి ఫేస్ బుక్ లు, ఇతర సామాజిక మాథ్యమాల అకౌంట్లను కూడ హ్యాక్ చేయడం ప్రారంభించాడు.
సరూర్ నగర్ కు చెందిన ఓ యువతికి చెందిన ఫేస్ బుక్ ను విక్రాంత్ రెడ్డి హ్యాక్ చేశాడు. ఈ ఫేస్ బుక్ ను చూసిన తర్వాత ఆమె ఫోన్ కే ఆమె ఫేస్ బుక్ యూజర్ ఐడి, పాస్ వర్డ్ ను పంపించాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.విక్రాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టుచేసి విచారణ చేశారు. అయితే సరదా కోసమే తాను ఇలా చేశానని ఆయన పోలీసులకు వివరించారు.
విక్రాంత్ రెడ్డి కి సంబందించిన ల్యాప్ ట్యాప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలించారు. అయితే సరదా కోసమే చేసినట్టు గుర్తించారు. విక్రాంత్ రెడ్డి తల్లిదండ్రులతో పాటు, ఆతని స్నేహితులు కూడ విక్రాంత్ వైఖరిని వివరించారు. కేసు నమోదు చేయకుండా వదిలేయాలని ప్రాధేయపడ్డారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఫిర్యాదు చేసిన యువతి కూడ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో విక్రాంత్ రెడ్డిని మందలించి వదిలేశారు పోలీసులు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications