హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నేడు, రేపు అన్ని స్కూళ్లకు సెలవులు

Hyderabad rains: అకాల వర్షానికి హైదరాబాద్.. అతలాకుతలమైంది. అల్లకల్లోలానికి గురైంది. ఏకబిగిన కుండపోతగా కురిసిన అతి భారీ వర్షం దెబ్బకు చివురుటాకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు నివాసాల్లో వర్షపునీరు చేరింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల జనం అంధకారంలో గడిపారు.

ఉత్తర తెలంగాణ, రాయలసీమ, విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 1.5 ఎత్తులో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ బెల్ట్‌లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్ష తీవ్రత మరో రెండు రోజుల పాటు ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనావేసింది.

Half day holiday for all schools in GHMC limits and full holidays in these districts in Telangana

ఈ ద్రోణి ప్రభావంతో కొద్దిరోజులుగా హైదరాబాద్‌ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈదురు గాలులు వీస్తోన్నాయి. వర్షం ధాటికి నగర రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వరద నీరు రోడ్లపై పోటెత్తింది. ప్రవాహాన్ని తలపించింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనదారులు గంటల కొద్దీ పడిగాపులు పడాల్సొచ్చింది.

పంజాగుట్ట, సోమాజిగూడ, ప్రకాష్ నగర్, మెట్టుగూడ, టోలీచౌకి, షేక్‌పేట్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్ రోడ్, నానల్ నగర్, లంగర్ హౌజ్, గోల్కొండ, పాతబస్తీ, లక్డీకాపూల్, ఉప్పల్, సికింద్రాబాద్, రాణిగంజ్, నాంపల్లి, కోటి, అబిడ్స్, మొజాంజాహీ మార్కెట్, అఫ్జల్ గంజ్..ఇలా ఒక్కటని కాదు..దాదాపుగా అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇదే పరిస్థితి అటు తెలంగాణ ఉత్తర ప్రాతం జిల్లాల్లోనూ నెలకొంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఏకధాటిగా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్ పట్టాల మీదికి వరద నీరు ప్రవహించింది. ఫలితంగా- రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంటోన్న జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవును ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.

  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ నేడు, రేపు హాఫ్ డే సెలవు ఉంటుంది.
  • జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని స్కూళ్లు ఉదయం పూట మాత్రమే పాఠశాలలు పని చేస్తాయి. మధ్యాహ్నం తర్వాత అన్ని స్కూళ్లకు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది.
  • వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి జిల్లాల్లోని అన్ని స్కూళ్లకు నేడు, రేపు పూర్తి సెలవు ఇచ్చారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+