ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్ మాట్లాడుతుండగా బాంబు పేలి తెగి పడిన చేయి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా చేతిలోని నాటు బాంబు పేలి చేయి తెగి పడిపోయింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోని పెద్ద చెరువు వద్ద సోమవారం జరిగింది. బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన శివ (32) చేపలు పడుదామని సోమవారం నాటుబాంబుతో బయ్యారం చెరువు వద్దకు వెళ్లాడు.

నాటుబాంబును చెరువులో విసిరి చేపలు పడుదామని అనుకుని బాంబుకు నిప్పంటించాడు. అదే సమయంలో ఫోన్ మోగడంతో బాంబు విషయం మరిచిపోయి ఫోన్ మాట్లాడడం ప్రారంభించాడు. దాంతో బాంబు ఒక్కసారిగా చేతిలోనే పేలింది. చేయి తెగిపడింది. క్షతగాత్రుడుని మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Hand cut of due to bomb blast in Khammam district

పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

పెళ్లి కావడం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని జైనూరు మండలం గూసిమెట్ట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. గురువ మంజుల (22) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది.

తనకు పెళ్లి కావడం లేదని గత కొంత కాలంగా తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో మంజుల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

English summary
A man hand cut as the country made bomb blasted in Khammam district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X