'హిందుత్వం నుండే ఇస్లాం, క్రైస్తవం': ర్యాలీ (పిక్చర్స్)

హైదరాబాద్: హిందూమతంలో నుంచే ఇస్లాం, క్రైస్తవ మతాలు పుట్టాయని భజరంగ్ దళ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ పాండే అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు హైదరాబాదులో లక్షలాది మంది శోభాయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా పాండే మాట్లాడారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నాలుగు లక్షల మంది హిందువులతో వీర హనుమాన్ ర్యాలీ అభినందనీయమన్నారు. హిందూ ధార్మిక సంస్థళు హిందువులను మేల్కొలిపే పనిలో పడ్డాయన్నారు.

హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమైన యాత్ర సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకూ కొనసాగింది. ద్విచక్ర వాహనాలతో యువత పెద్దఎత్తున యాత్రలో పాల్గొన్నారు.

కాషాయి జెండాలు చేతబూని హనుమాన్ నామస్మరణతో భక్తులు చేసిన సందడితో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సంయుక్త్ధ్వార్యంలో ఉదయం పదకొండు గంటలకు గౌలీగూడ రామమందిర్ వద్ద యాత్రను బజరంగ్‌దళ్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాజేష్ పాండే ప్రారంభించారు.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

హిందూ ధర్మం ఎక్కడ రక్షించబడుతుందో అక్కడ ప్రశాంతత నెలకొంటుందని భజరంగ్ దళ్ అంతర్జాతీయ అధ్యక్షులు రాజేష్ పాండే అన్నారు. తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద సిఖ్‌విలేజ్ ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజలు, యువకులు శాంతిని కోరుకుంటున్నారని, వారిలో శాంతిని అలా ఉంచితేనే మంచిదని లేకపోతే పరిణమాలు చెప్పలేనివిగా ఉంటాయన్నారు.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

హిందూమతం నుంచే ఇస్లాం, క్రైస్తవం పుట్టిన విషయం తెలుసుకోవాలన్నారు. దైత్య గురువు శుక్రాచార్యుడు అరబ్ దేశాల పర్యటనలో అక్కడ శివలింగం ఏర్పాటు చేశారని, అదిప్పుడు మక్కా మసీదుగా వెలుగొందుతోందన్నారు. క్రిస్మస్ అనేది కృష్ణుని నెల అని, రంజాన్ అంటే రాముని గురించి తెలుసుకునే మాసమని వివరించారు.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

హిందువులు ప్రశాంతంగా ఉన్నంతసేపే అవతలి వారి ఆటలు సాగుతాయని, ఒక్కసారిగా కళ్లు తెరిస్తే పరిస్థితి ఎలాఉంటుందో ఊహించలేమన్నారు. హిందూ ధర్మాన్ని రక్షించలేని 40 దేశాల్లో ఉగ్రవాదం పేట్రేగిపోతోందని హెచ్చరించారు.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

వీరాంజనేయ శోభాయాత్ర 2వేల 5వందల మందితో ప్రారంభమై ఈరోజు లక్షనుంచి 4 లక్షల వరకూ పెరిగిందని, ర్యాలీకి నగర పోలీసుల సహకారం భేషుగ్గా ఉందన్నారు. హిందువుల్లో పెరిగిన ఐక్యత చూసి ఇతరుల గుండెల్లో భయం పట్టుకుందన్నారు.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

నగరంలో ఈ హనుమాన్ విజయయాత్రతో హిందూ బంధువుల్లో మెరిసిన దరహాసం రేపటి ఐక్యతకు నాందిగా అభివర్ణించారు. సభలో విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, తెలంగాణ భజరంగ్ దళ్ అధ్యక్షుడు భానుప్రకాశ్, పూర్వ అధ్యక్షుడు యమన్‌సింగ్‌తోపాటు భజరంగ్ దళ్, విహెచ్‌పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

యాత్రలో వేలాది భక్తులు పాల్గొని తమ భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. పుత్లీబౌలీ, కోఠి, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసి క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్, పద్మశాలికాలనీ, గాంధీనగర్, కవాడిగూడ, బైబిల్ హౌజ్, సికిందరాబాద్ ప్యారడైజ్ ప్రాంతాల మీదుగా తాడ్‌బన్ ఆంజనేయస్వామి ఆలయం వరకు కొనసాగిన యాత్ర శ్రీరామనామ స్మరణతో మార్మోగింది.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

భక్తులంతా కాషాయపు జెండాలను చేతబూనటంతో వీధులన్నీ కాషాయమయంగా మారాయి. గల్లీగల్లీ, బస్తీబస్తీల్లో కాషాయపు జెండాలు, తోరణాలు కట్టి కాషాయమయం చేశారు. హనుమాన్ చాలీసా, భక్తి గీతాలను ఆలపిస్తూ, శ్రీరామ, ఆంజనేయ నినాదాలతో శోభాయాత్రలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

అడుగడుగున స్వాగత వేదికలతో స్వచ్చంద, ధార్మిక సంస్థలు, రామభక్తుల వేదికల వద్ద యాత్రకు ఆహ్వానం పలుకుతూ, భక్తుల కోసం మంచినీరు, పులిహోరా, మజ్జిగ, స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మరికొన్నిచోట్ల మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

ఎటు చూసిన జై శ్రీరామ్ అన్న నినాదాలే విన్పించాయి. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో యాత్ర నారాయణగూడకు చేరుకుంది. ముందుజాగ్రత్త చర్యగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, నారాయణగూడల మధ్య పోలీసులు వాహన రాకపోకలను నిషేధించారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లించారు.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

సికిందరాబాద్ తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేవాలయం వరకూ పోలీసుల గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఘనంగా, ప్రశాంతంగా జరిగింది. భారీ బందోబస్తుతోపాటు గతంలో ఎన్నడూలేని విధంగా వంద మూవింగ్ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

 హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

మూడు రోజుల క్రితం నల్గొండ సూర్యపేటలో పోలీసులపై కాల్పులు జరిపిన దుండగులను శనివారం ఉదయం పోలీసులు మోత్కుర్ జానికిపురంలో ఎన్‌కౌంటర్ చేయటం, దుండగులు సిమి నిషేదిత సంస్థకు చెందిన కార్యకర్తలుగా నిఘా వర్గాలు నిర్థారించటంతో శనివారం హైదరాబాద్ మహానగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+