హార్డ్‌ వర్కర్, స్మార్ట్‌ సీఎం: కేసీఆర్‌పై మరోసారి పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు

ఒకప్పుడు ఉప్పు-నిప్పులా చిటపటలాడిన సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలు-నీళ్లలా కలిసిపోయారు. దీనికి నిదర్శనం సోమవారం కరీంనగర్‌లో జనసేనాని సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించడమే.

కరీంనగర్: ఒకప్పుడు ఉప్పు-నిప్పులా చిటపటలాడిన ముఖ్యమంత్రి కేసీఆర్, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలు-నీళ్లలా కలిసిపోయారు. దీనికి నిదర్శనం సోమవారం కరీంనగర్‌లో జనసేనాని సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించడమే.

గతంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌పై పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కేసీఆర్ కూడా తనదైన శైలిలో ప్రతిస్పందించారు. అప్పటి నుంచి వీరు ఎడముఖం పెడముఖంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావించారు. ఆ తర్వాత పవన్ కూడా తెలంగాణ రాజకీయాలపై అంతగా స్పందించలేదు.

pawan-kalyan

ఈ మధ్యే రాష్ట్రపతి రాక సందర్భంగా గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందులో పవన్, కేసీఆర్ కలిశారు. ఆ తర్వాత పవన్ ప్రగతి భవన్ సందర్శన నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగినట్లు సమాచారం. ప్రగతి భవన్ సందర్శనలో కేసీఆర్‌పై పవన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

తాజాగా మళ్లీ సీఎం కేసీఆర్‌పై జనసేనాని ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్‌ హార్డ్‌ వర్కర్ అని, ఆయన స్మార్ట్‌ సీఎం అని, బాగా పనిచేస్తున్నారని పవన్ కొనియాడారు. కేసీఆర్‌తో వైరం పెట్టుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారని తాను భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు కాబట్టే, ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారని పవన్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+