Naveen Case: హత్యకు ముందు తర్వాత ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన హరిహరకృష్ణ..!
తెలంగాణ, ఏపీతో పాటు దేసంలో సంచలనంగా మారిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీసుల కస్టడీ గురువారంతో ముగిసింది. నిందితుడి నుంచి పోలీసులు స్టేట్ మెంటి రికార్డు చేశారు. కన్ఫెన్షన్ స్టేట్ మెంట్ ను కోర్టుకు సమర్పించారు. హరిహరకృష్ణను విచారిస్తున్న సమయంలోనే అతని స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారిక రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది.

2017-2019
అయితే హరిహర కృష్ణ విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. హరిహరకృష్ణ నవీన్ తో పరిచయం నుంచి హత్య వరకు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పాడు. నవీన్ తో హరిహరకృష్ణ 2017-2019 మధ్య దిల్ సుఖ్ నగర్ లో ని ఐడియల్ ఇంటర్ కాలేజీలో ఇంటర్ చేశాడు. ఆ సమయంలోనే వారికి పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారారు. బీటెక్ లో నవీన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చేరగా.. హరిహరకృష్ణ అరోరా ఇంజినీరింగ్ కాలేజిలో జాయిన్ అయ్యాడు.

నిహారికతో పరిచయం
ఇంటర్ లో ఉన్నప్పుడు నవీన్ కు నిహారికతో పరిచయం అయింది. వారిద్దరు ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. వారిద్దరి గురించి అన్ని విషయాలు తనతో చెప్పేవారిని హరిహరకృష్ణ పోలీసులకు తెలిపాడు. నవీన్ వేరే అమ్మాయితో నిహారిక నవీన్ తో గొడవ పడినట్లు హరిహర చెప్పాడు. ఆ తర్వాత నిహారిక నవీన్ మాట్లాడడం మానేసిందని వివరించాడు. అయితే నిహారిక అంటే తనకు ఇష్టమని హరిహరకృష్ణ చెప్పాడు.
9 నెలల క్రితం
నవీన్, నిహారిక విడిపోవడంతో 9 నెలల క్రితం నిహారికను ప్రేమిస్తున్నానని ఆమె చెప్పినట్లు హరిహర తెలిపాడు. తన ప్రేమను నిహారిక ఒప్పకున్నట్లు చెప్పాడు. అయితే నవీన్ నిహారికకు ఫోన్ చేస్తూ, మేసేజ్ లు పెడుతూ ఇబ్బంది పెట్టేవాడని హరిహర పేర్కొన్నాడు. ఈ విషయం తనకు నిహారిక చెప్పిందన్నాడు. దీంతో నవీన్ ను చంపాలని రెండు నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు.
రూ.200 కత్తి
మలక్ పేట డీ మార్ట్ లో రూ.200 కత్తి కొనుగోలు చేసినట్లు చెప్పాడు. గ్లౌజ్స్ కూడా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాడు. ఫిబ్రవరి 17న నవీన్ ను గొంతు నులిమి హత్య చేసినట్లు హరిహరకృష్ణ ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాతి రోజు
మర్డర్ గురించి నిహారికకు చెప్పానని హరిహరకృష్ణ వెల్లడించాడు. ఫిబ్రవరి 24వ నేరుగా నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకొని హత్య చేసిన స్పాట్ కి వచ్చానని హరిహరకృష్ణ చెప్పాడు. అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేసిన ఆ తర్వాత అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల ముందు లొంగిపోయిపోయినట్లు తెలిపాడు.












Click it and Unblock the Notifications