నా ఓటమికి అతనే కారణం! రివెంజ్, మనీ పాలిటిక్స్‌పై జగ్గారెడ్డి సంచలనం

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సంగారెడ్డిలో తన ఓటమికి మాజీ మంత్రి హరీశ్ రావు కారణమని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు సిద్దిపేటలో గెలుపొందడానికి ఎంత కష్టపడ్డారో.. తనను ఓడించేందుకు అంతే చెమటోడ్చారని అన్నారు.

రాజకీయ వ్యూహం పన్ని, విజయావకాశాలను దెబ్బతీశారని జగ్గారెడ్డి ఆరోపించారు. మరోవైపు, ప్రతీకార రాజకీయాలపైనా ఆయన స్పందించారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాన వ్యతిరేకమని అన్నారు. అయినా రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకీ మంచిది కాదని హితవు పలికారు. అలాంటి రాజకీయాలు చేసేవాళ్లు అధికారం పోయాక బాధపడాల్సి వస్తుందన్నారు.

Harish Rae is the reason for my defeat in Sangareddy Jagga Reddy

చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ రివెంజ్ రాజకీయాలు చేయలేదన్నారు జగ్గారెడ్డి. ఏ పార్టీకైనా కక్ష సాధింపు రాజకీయాలు మంచిది కాదని.. తెలంగాణ ప్రజల రక్తంలో కక్షసాధింపు గుణమే ఉండదన్నారు. అలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమని చెప్పుకొచ్చారు.

రాజకీయ యుద్ధం చేస్తాను తప్ప.. రివెంజ్ పాలిక్స్ చేయనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రివెంజ్ పాలిటిక్స్ కాంగ్రెస్ నేతలు చేసినా మంచిది కాదని స్పష్టం చేశారు. అలాంటి రాజకీయ నాయకులు ఏదో ఒకరోజు బాధపడక తప్పదని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఫస్ట్ ప్రోటోకాల్.. తన భార్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్.. ఆమె ప్రోటోకాల్ సెకండ్ ఉండాల్సిందేనని అన్నారు జగ్గారెడ్డి. 60 శాతం, 40 శాతంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచిస్తున్నట్లు తెలిపారు. తనతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలరా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+