కంగ్రాట్స్.. థ్యాంక్స్ బావా: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హరీష్ రావు ఇంటికెళ్లిన కేటీఆర్
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కేటీ రామారావును నియమించిన విషయం తెలిసిందే. కేటీఆర్‌కు కీలక పదవి దక్కడంపై పలువురు అభినందనలు తెలిపారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు శుభాకాంక్షలు చెప్పారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. కేసీఆర్ ఓ వైపు ముఖ్యమంత్రిగా పాలనపై దృష్టి సారిస్తూ ఢిల్లీ రాజకీయాల వైపు నడవనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని కేటీఆర్ చేతిలో పెట్టారు. పార్టీని నడిపించే బాధ్యతను అప్పగించారు. సభ్యత్వ నమోదు. జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతం బాధ్యతలు కేటీఆఱ్ తీసుకోనున్నారు. తెరాస పార్టీ చరిత్రలో తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ సమావేశానికి
శుక్రవారం తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన ఇది జరగనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ హాజరు కానున్నారు. పంచాయతీ ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం కావడంపై అసదుద్దీన్, అభిమానులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చారని, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తాను కృషి చేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్‌కు హరీష్ రావు శుభాకాంక్షలు
సిద్దిపేట నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన హరీష్ రావు కూడా ఈ నియామకంపై స్పందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌కు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఇరువురు కూడా పలకరించుకున్నారు. కేటీఆర్.. హృదయపూర్వక శుభాకాంక్షలు అని హరీష్ రావు తెలిపారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. చాలా థ్యాంక్స్ బావా అని పేర్కొన్నారు.

హరీష్ రావు ఇంటికి వెళ్లిన కేటీఆర్
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించబడిన కేటీ రామారావు శుక్రవారం మధ్యాహ్నం తన బావ హరీష్ రావు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కేటీఆర్ పలువురు సీనియర్ నేతలను కలుస్తున్నారు. తెరాసలో కేసీఆర్ తర్వాత ఎవరు అనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. ఇప్పుడు దానికి తెరదించారు. కేసీఆర్ తర్వాత హరీష్ రావు అవుతారని భావించిన వారికి ఇది చేదు వార్తే.

కేటీఆర్ థ్యాంక్స్
కేటీఆర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, బాల్క సుమన్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.
Thanks Mayor Saab https://t.co/C612HrP3we
— KTR (@KTRTRS) December 14, 2018
Many thanks Suman https://t.co/0lmxhNxPX8
— KTR (@KTRTRS) December 14, 2018
Shukriya Asad Bhai 🙏 https://t.co/g8siNrQCCZ
— KTR (@KTRTRS) December 14, 2018
Many thanks Sir 🙏 https://t.co/C4toolH5V8
— KTR (@KTRTRS) December 14, 2018
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications