హరీశ్‌కు తప్పిన ప్రమాదం: భారీ బైక్ ర్యాలీ, పేలిన టపాసులు
సంగారెడ్డి: టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంత్రి హరీశ్‌రావుకి తృటిలో ప్రమాదం తప్పింది. సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి హరీశ్ రావు భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓ కూడలి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అయితే ద్విచక్రవాహనాలకు అతిసమీపంలో బాణసంచా కాల్చడంతో పలు టపాసులు పేలి కార్యకర్తలపై పడ్డాయి.

కాగా, కార్యకర్తలు భయంతో ద్విచక్రవాహనాలు వదిలి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. బాణసంచా పొగల్లో హరీశ్‌రావు చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు గన్‌మెన్లు వచ్చి ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా, తాను క్షేమంగానే ఉన్నానని అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీశ్ ట్విట్టర్ వేదికగా కోరారు.
సంగారెడ్డి ఎన్నికల ప్రచారం ర్యాలీలో నాకు ఎటువంటి ప్రమాధం జరుగలేదు. నేను క్షేమంగానే ఉన్నా .. మిత్రులెవరూ ఆందోళన చెందవద్దు..
— Harish Rao Thanneeru (@trsharish) September 29, 2018
మీ అభిమానానికి ధన్యవాదాలు
కుంభకోణాలకు మారుపేరే జగ్గారెడ్డి
సంగారెడ్డి పర్యటన సందర్భంగా హరీశ్ రావు.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కిరాయి కోసం పరాయి మనుషులతో అమెరికాకు వెళ్లిన వ్యక్తి జగ్గారెడ్డి అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కుంభకోణాలకు మారుపేరుగా ఆయన నిలుస్తారని ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య సమరయోధుల పేరిట కూడా జగ్గారెడ్డి భూ కుంభకోణాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. పరాయి మహిళను భార్యగా చెప్పుకునే వ్యక్తికి కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందా? తెలంగాణను వ్యతిరేకించిన జగ్గారెడ్డికి కమిటీలో చోటు కల్పిస్తారా? అని హరీశ్ ప్రశ్నించారు. జగ్గారెడ్డి చేసిన పనులతో ఆయన వెంట తిరిగేందుకు కార్యకర్తలు సిగ్గుపడుతున్నారని అన్నారు.
Participated in bike rally at Sangareddy along with MP Sri Prabhakar Reddy and @trspartyonline Sangareddy candidate Sri Chinta Prabhakar Garu. pic.twitter.com/dBev2KpIBg
— Harish Rao Thanneeru (@trsharish) September 29, 2018












Click it and Unblock the Notifications