వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు అవినీతి, అక్రమాల కోసమే సెక్షన్ 8: ఉద్యమమేనన్న హరీశ్

|
Google Oneindia TeluguNews

మెదక్: హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేస్తే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా ములుగులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి అక్రమాలను, దోపిడీలను కొనసాగించడానికి సెక్షన్ 8ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ప్రభావానికి కేంద్రం తలొగ్గి సెక్షన్ 8ను అమలు చేస్తే జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ మళ్లీ ఉద్యమం చేపడుతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Harish Rao fires at Chandrababu

గవర్నర్‌గిరి చెల్లదు: అల్లం నారాయణ

హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో గవర్నర్‌గిరి చెల్లదని ప్రెస్ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో సెక్షన్-8 వర్తింపజేయాలని కేంద్రం తెస్తున్న కుట్రలను ఛేదిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రశాంత వాతావరణంలో ఉందని, సెక్షన్-8 తెరపైకి తేవడంలో ఉద్దేశ్యాలు వేరేగా ఉన్నట్లు స్పష్టమవుతుందని టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ క్రాంతికిరణ్ తేల్చి చెప్పారు.

English summary
Telangana Minister Harish Rao on Tuesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu for section 8 issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X