చేసింది మేమైతే.. చెప్పుకునేది మీరా?: కాంగ్రెస్ సర్కారుపై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం.. 'వంట అయ్యాక గరిటె తిప్పినట్లు'గా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే.. తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తుండటం దౌర్భాగ్యమని విమర్శించారు.
ఫిబ్రవరి 1, 2024 న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని పత్రికల సాక్షిగా ప్రచారం చేసిన కాంగ్రెస్.. దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తోందతీ వుమీచమపమాకగ. చేయని పనులకు డబ్బా కొట్టుకోవడానికి బదులు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని హరీశ్ రావు సూచించారు.

తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేర్చే లక్ష్యంలో భాగంగా పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల నిర్మాణంతో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తమ ప్రభుత్వం మంజూరు చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.
ఆ తర్వాత 2023 జూన్ 22న 1,890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగినట్లు చెప్పారు. 2023 ఆగస్ట్ 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి, తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. దీంతో తుది ఫలితాల విడుదలకు ఆటంకం కలిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావుడి చేస్తోందని విమర్శించారు. స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటోందని ధ్వజమెత్తారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామి ప్రకారం.. ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించి, అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, ఏడాదిలోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారని తెలిపారు. అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు విడుదల చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న గ్రూప్ 3, 4 నియామకాలకు నోటిఫికేషన్, మార్చి1న పోలీసు సహా తరహా యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఎదురుచూస్తున్న ఉద్యోగ అభ్యర్థులకు, విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. మరోవైపు, ఉద్యోగాలు సాధించని అభ్యర్థులకు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications