‘మిషన్’ హెల్ప్‌లైన్ ప్రారంభించిన హరీశ్(పిక్చర్స్)
హైదరాబాద్: మిషన్ కాకతీయ పేరుతో జరుగుతున్న చెరువుల్లోని పూడిక తీసివేతకు సంబంధించి సమస్యలు, సమాచారం ఇవ్వాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. 040- 23472233 నంబర్‌కు మిషన్ కాకతీయకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వదలచిన వారు ఫోన్ చేయవచ్చునని హరీశ్‌రావు తెలిపారు.
త్వరలోనే మిషన్ కాకతీయ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మిషన్ కాకతీయలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిన రైతులు తమ పొలాల్లో వేసుకోవాలని సూచించారు. రైతులు ముందుకు రాకపోతేనే ఈ మట్టిని ఇతర అవసరాలకు ఉపయోగించాలని అన్నారు.
ఏప్రిల్ 19న తెలంగాణ జెఏసి మిషన్ కాకతీయలో శ్రమ దానం చేయాలని నిర్ణయించడాన్ని అభినందిస్తున్నట్టు, స్వాగతిస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. 6,918 చెరువుల్లోని పూడిక తీసివేయడానికి 2,137 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలనా పరమైన అనుమతి మంజూరు చేసినట్టు చెప్పారు. మిషన్ కాకతీయపై ప్రారంభంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారని, ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ఒక సవాల్‌గా తీసుకుని ప్రారంభించారని హరీశ్‌రావు తెలిపారు.
మిషన్ కాకతీయ పనుల్లో 2500 బుల్డోజర్లు పని చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్, టిడిపి వారికి ఈ పనులు కనిపించడం లేదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ టిడిపి నాయకులు టిడిపి అధినేత చంద్రబాబు తొత్తులుగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టిడిపి నాయకులు బాబును వీడి తెలంగాణ కోసం మాట్లాడాలని అన్నారు.

హరీశ్ రావు
మిషన్ కాకతీయ పేరుతో జరుగుతున్న చెరువుల్లోని పూడిక తీసివేతకు సంబంధించి సమస్యలు, సమాచారం ఇవ్వాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు.

హరీశ్ రావు
040- 23472233 నంబర్‌కు మిషన్ కాకతీయకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వదలచిన వారు ఫోన్ చేయవచ్చునని హరీశ్‌రావు తెలిపారు.

హరీశ్ రావు
త్వరలోనే మిషన్ కాకతీయ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మిషన్ కాకతీయలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు.

హరీశ్ రావు
చెరువుల్లో పూడిక తీసిన మట్టిన రైతులు తమ పొలాల్లో వేసుకోవాలని సూచించారు. రైతులు ముందుకు రాకపోతేనే ఈ మట్టిని ఇతర అవసరాలకు ఉపయోగించాలని అన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications