వేమూరి రాధాకృష్ణపై హరీష్ ప్రశంసలు: వైరం ముగిసిందా?
హైదరాబాద్: తాజా సంఘటనను చూస్తుంటే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు, తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి మధ్య వైరం ముగిసిందా అనే ఆలోచన తలెత్తుతోంది. తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతేకాదు, వేమూరి రాధాకృష్ణను ప్రశంసించారు. ఆంధ్రజ్యోతి పత్రిక నిజాలను నిర్భయంగా వెల్లడిస్తోందని హరీష్ రావు అభినందించారు. ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కార్ రేస్ బంపర్ డ్రా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో కలిసి డ్రా తీశారు.

కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలంలోని బాంకూరుకు చెందిన రాహుల్ ఈ డ్రాలో విజేతగా నిలిచి కారు సొంతం చేసుకున్నారు. డ్రాలో విజేతగా నిలిచిన రాహుల్‌తో మంత్రి హరీష్ రావు ఫోన్‌లో మాట్లాడారు. నిజాయితీ గల పత్రికను చదువుతూ... కారు గెల్చుకున్నందుకు రాహుల్‌కు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' ప్రజల తరపున పోరాడుతున్నందుకు ఎండీ వేమూరి రాధాకృష్ణను అభినందిస్తున్నానని చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పని చేయాలని, ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తోన్నఅభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయాలని మంత్రి హరీష్ రావు కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్య, సర్క్యులేషన్ డైరెక్టర్ రామకృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications