ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు ద్రోహం - హరీష్ సంచలనం..!!
మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణ ద్రోహం జరుగుతుందని మండిపడ్డారు. ఢిల్లీలో ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు మరణశాసనం రాస్తున్నదని చెప్పారు. తమకు రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని స్పష్టం చేసారు. ఏపీ ప్రభుత్వం జలద్రోహం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు ఢిల్లీలో జలశక్తి శాఖ నిర్వహిస్తున్న సమావేశం పైన సీరియస్ గా స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జల ద్రోహం జరుగుతుందన్నారు. తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందని చెప్పారు. గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో తమ పార్టీ తొలి నుంచి కాంగ్రెస్ సర్కారును అప్ర మత్తం చేస్తూనే ఉందని వివరించారు.

వాస్తవాలు బయట పెట్టినా ప్రభుత్వం తరఫున నామ మాత్రంగా బ్యాక్ డేట్ వేసి, లెటర్లు మీడియాకు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని హరీష్ విమర్శించారు. బనకచర్ల అయినా, నల్లమలసాగర్ అయినా మారింది పేరు మాత్రమేనని.. కానీ, ఏపీ జలదోపిడి ఆగలేదన్నారు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే పొడిచేది రేవంత్ రెడ్డి..అంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని ఆరోపించారు.
సీఎం రేవంత్ టార్గెట్ గా
ఢిల్లీలో జలవివాదంపై జరుగుతున్న మీటింగ్‌లో రాష్ట్రానికి ద్రోహం జరగనుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నల్లమలసాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నాడు డిల్లీ మీటింగ్‌కు వెళ్ళారని గుర్తు చేసిన హరీష్.. నాటి ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపారని ఫైర్ అయ్యారు. పెట్టబోను అంటూనే సంతకంపెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాశారని విమర్శించారు. వేయను అంటూనే కమిటీవేసి ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేశారని ఆరోపించారు.
టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్ళి నల్లమలసాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపారని విమర్శలు గుప్పించారు. పసలేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమలసాగర్‌కు మద్దతు ప్రకటించారని విమర్శించారు. ఏపీ ఒత్తిడితో ఇవాళ జరుగుతున్న ఢిల్లీ మీటింగ్‌లో ఇంజినీర్లు పాల్గొంటున్నారని.. ఇది పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, మన 200 టీఎంసీల నీటిని గంపగుత్తగా తరలించుకు పోయే నల్లమల సాగర్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన కుట్ర అంటూ హరీష్ వ్యాఖ్యానించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications