రేవంత్‌కు హరీష్ రావు సవాల్ - ప్లేస్ నువ్వే డిసైడ్ చెయ్..!!
ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. తాము 17వేల కోట్లతో లక్ష రుణమాఫీ చేస్తే 36లక్షల మంది రైతులకు రుణ మాఫీ జరిగిందన్నారు. కాంగ్రెస్ 17వేల కోట్లతో రుణ మాఫీ పూర్తిగా ఎలా అవుతుందని మాజీమంత్రి ప్రశ్నించారు. రేవంత్ పరిపాలనలో ఫ్లాప్ రేవంత్ తొండిలో తోపు బూతులు తిట్టడంలో టాప్ అని హరీష్ వ్యాఖ్యానించారు.
ఎగనామం
రైతులకు ఎగనామం పెట్టి మొత్తం రుణమాఫీ చేసినట్లు ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ ను బీఆర్ఎస్ వదిలి పెట్టదని హెచ్చరించారు. కేబినెట్‌లో 31వేల కోట్లు అన్నారని.. బడ్జెట్‌లో రూ.26వేల కోట్లు పెట్టారని చెప్పారు. తీరా రూ.17933 కోట్లు మాత్రమే ఇచ్చి 22లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పుకొచ్చారు. రూ.14వేల కోట్లు కోత పెట్టి రుణమాఫీ పూర్తి అయ్యింది అంటున్నారని ఫైర్ అయ్యారు. రైతుల సంఖ్య 47లక్షలు అని చెప్పి 22లక్షల మంది రైతులకు మాత్రమే చేశారని లెక్కలు చెప్పారు.

శ్వేతపత్రం
25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదని వివరించారు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. రేవంత్ ఎక్కడకు చెబితే అక్కడకు వస్తానని హరీష్ సవాల్ చేసారు. ప్లేస్ నువ్వే డిసైడ్ చెయ్.. సంపూర్ణ రుణమాఫీ అయిందో.. లేదో.. రైతులనే అడుగుదాం అంటూ ఛాలెంజ్ విసిరారు. కొడంగల్‌లో ఓడితే రాజీనామా చేస్తా అని చెప్పి మాట తప్పారని రేవంత్ పై మండిపడ్డారు. తెలంగాణ కోసం మాట మీద నిలబడి రాజీనామా చేసిన చరిత్ర తనదని గుర్తు చేసారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని తాను చెప్పానని.. కానీ రుణమాఫీ కూడా సంపూర్ణంగా కాలేదన్నారు.
పోరాటం చేస్తాం
రేవంత్ రెడ్డి ఎనిమిది నెలల ప్రయాణం మోసమని ఆరోపించారు. రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదన్నారు. రుణమాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. రుణాలు తీసుకున్న మొత్తం రైతుల సంఖ్య ఎంత, రుణమాఫీ అయిన రైతుల సంఖ్య ఎంతనో పూర్తి వివరాలు బయట పెట్టాలన్నారు. రేవంత్ పరిపాలనలో ఫ్లాప్ రేవంత్ తొండిలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్ అంటే వ్యాఖ్యానించారు. త్వరలోనే రైతుల పక్షాన బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications