కాంగ్రెస్ ది.. అర్థం పర్థం లేని సొల్లుపురాణ ప్రజెంటేషన్ : హరీశ్

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తప్పుబడుతూ.. దానికి ధీటుగా 'వాస్తవ జలదృశ్యం' కాంగ్రెస్ పార్టీ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రజెంటేషన్ పై రిటైర్డ్ ఇంజనీర్లు పెదవి విరుస్తుండగా.. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కూడా కాంగ్రెస్ ప్రజెంటేషన్ ను దుయ్యబట్టారు.

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన ప్రజెంటేషన్ ను ఓ సొల్లు పురాణంగా అభివర్ణించారు మంత్రి హరీశ్ రావు. ఐడీసీ కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో ప్రాజెక్టులపై సమీక్ష సందర్బంగా.. కాంగ్రెస్ ఇచ్చిన ప్రజెంటేషన్ పై స్పందించాలని మంత్రి హరీశ్ రావును కోరారు మీడియా ప్రతినిధులు. దీనిపై హరీశ్ స్పందిస్తూ.. అర్ధం పర్థం లేని ప్రజెంటేషన్ పై ఏం స్పందిస్తామంటూ అసహనం వ్యక్తం చేశారు.

Harish rao takes on Congress Power point presentation on irigation projects of Telangana

కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లుగా.. కాంగ్రెస్ హయాం నాటికే 98 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించి ఉంటే, రాష్ట్రంలో ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరిగి ఉండేవని ప్రశ్నించారు హరీశ్. వాస్తవాలేంటో ప్రజలందరికీ తెలుసునని, మంచి చెడులపై వాళ్లకు అవగాహన ఉందన్న హరీశ్.. ప్రాజెక్టులపై తమ చిత్తశుద్దిని చేతల్లోనే చూపిస్తామని స్పష్టం చేశారు.

పెదవి విరుస్తున్న రిటైర్డ్ ఇంజనీర్లు :

కాంగ్రెస్ ప్రజెంటేషన్ లో లోపాలను ఎత్తిచూపుతున్నారు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు. ప్రజెంటేషన్ కు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన రిటైర్డ్ ఇంజనీర్లు.. తెలంగాణలో 1956లో 17 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే 2004 నాటికి అది 47 లక్షల ఎకరాలకు చేరిందని చెప్పారు. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం తమ ప్రజెంటేషన్ ద్వారా.. 2014నాటికి మరో 51 లక్షల ఎకరాల ఆయకట్టుకు రూపకల్పన చేశామని, ఆవిధంగా మొత్తం 98లక్షల ఎకరాలకు ఆయకట్టుకు రూపకల్పన చేశామని చెప్పుకోవడం అసత్యాలను ప్రచారం చేయడమేనని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+