మెచ్చుకోవాల్సి వస్తుందని చిలిపిచేష్టలు, గిల్లికజ్జాలు, అప్పుడే క్లీన్ బౌల్డ్: హరీష్
గవర్నర్ ప్రసంగం సమయంలో వాకౌట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చిలిపి చేష్టలు చేసిందని, కేసీఆర్ ప్రభుత్వం తీరును మెచ్చుకోవాల్సి వస్తుందని గిల్లికజ్జాలు పెట్టుకొనే ప్రయత్నాలు చేస్తోందని మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం సమయంలో వాకౌట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చిలిపి చేష్టలు చేసిందని, కేసీఆర్ ప్రభుత్వం తీరును మెచ్చుకోవాల్సి వస్తుందని గిల్లికజ్జాలు పెట్టుకొనే ప్రయత్నాలు చేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు.
గవర్నర్ ప్రసంగం సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. దీనిపై మంత్రి హరీష్ రావు, గవ్వల బాలరాజు తదితరులు మండిపడ్డారు. వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

గతంలోనే క్లీన్ బౌల్డ్ అయ్యారు
గత అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు క్లీన్ బౌల్డ్ అయ్యాయన్నారు. విపక్షాలు ఏం మాట్లాడినా సమాధానాలు చెప్పేందుకు తాము సిద్ధమని చెప్పారు. గవర్నర్ ప్రసంగం సమయంలో విపక్షాలు హుందాగా వ్యవహరించాలన్నారు.

గవర్నర్ ప్రసంగం తర్వాత చెప్పొచ్చుగా..
ఏ అంశం పైన అయినా చర్చకు సిద్ధమని తాను గతంలోనే చెప్పామన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్, టిడిపి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి తొందరపాటు ఎందుకని, ఏదైనా చెప్పదలుచుకుంటే గవర్నర్ ప్రసంగం తర్వాత చెప్పాలన్నారు.

సమాధానం చెప్పాలి
విపక్షాలు ఎందుకు వాకౌట్ చేశాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, టిడిపి అసెంబ్లీలో చర్చించే సత్తా లేక వాకౌట్ చేశాయన్నారు. సమావేశాల్లో పాల్గొంటే ప్రభుత్వ పథకాలను అభినందించాల్సి వస్తుందని వెళ్లిపోయాయన్నారు.

అడ్డుపడితే చర్యలే
గత సెషన్‌లో విపక్షాలు వద్దనే వరకు తాము సమావేశాలు నిర్వహించామని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడితే చర్యలు తీసుకోవాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్, టిడిపి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

గొప్ప రాష్ట్రంగా చేయాలని కేసీఆర్ ఆలోచన
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సమయంలో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చునని అన్నారు. విభజన తర్వాత దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు.

మెచ్చుకోవాల్సి వస్తుందనే
కాంగ్రెస్ పార్టీ ఎందుకు తత్తరపడుతోందని, అంతా చిలిపి చేష్టలు చేస్తోందని, రేపు ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బలహీన వర్గాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తెచ్చిందని వారికి అర్థమైందని, ఈ పథకాలు ఇష్టం లేక గిల్లికజ్జాలు పెట్టుకునేందుకు వాకౌట్ చేశారన్నారు. మీరు స్లోగాన్స్ ఇచ్చి, ఎందుకు వాకౌట్ చేశారని నిలదీశారు.












Click it and Unblock the Notifications