Harish Rao: హరీశ్ రావుకు షాక్.. మాజీ పీఏ అరెస్ట్..
సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో గోల్ మార్ జరిగినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కొందరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాత పీఏ నరేష్ కుమార్ ఉన్నారు. నరేష్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మెదక్ జిల్లాకు చెందిన రవి నాయక్ ఫిర్యాదుతో పోలీసులు కేసు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. గతంలో మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు పీఏగా వ్యవహరించిన జె.నరేశ్ కుమార్, కొర్లపాటి వంశీ, బాలగోని వెంకట్ గౌడ్, ఓంకార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. వీరంతా ఎలాంటి మెడికలు బిల్లులు లేకుండానే సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకున్నట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

అంతే కాకుండా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న వారి పేరుతో మరొకరికి కూడా చెక్కులు అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు సంచి హరికృష్ణ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన వచ్చి చెక్కుపై ఇంటి పేరు వేయకుండా ఎస్ హరికృష్ణ అని చెక్ ఇస్తారు. ఇలా ఎస్ హరికృష్ణ పేరు వేరే వ్యక్తికి చెక్ ఇస్తారు. అతనికి కొంత డబ్బు ఇచ్చి మిగతావి వీరు తీసుకుంటారు.
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు. తాజాగా హరీశ్ రావు పీఏ చేసిన వ్యక్తి అరెస్ట్ కావడంతో బీఆర్ఎస్ చర్ఛనీయంశంగా మారింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం జరిగిన అక్రమాలపై ప్రభుత్వ దృష్టి పెట్టడంతో ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications