తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన: 3 రోజులు..
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుండటంతో అన్ని పార్టీలు తమ ప్రచార ఉధృతిని పెంచాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తోన్నారు. బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు.
ఈ జోరుకు వర్షం బ్రేకులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఉంటుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌లల్లో భారీ వర్షలు కురుస్తాయి. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరిల్లోనూ ఓ మోస్తరు వర్షం పడుతుంది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మీదుగా పశ్చిమ దిశ నుంచి వీస్తోన్న బలమైన గాలుల ప్రభావం (Western disturbance) వల్ల ఓ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో కురిసిన వర్షాల వల్ల బీఆర్ఎస్.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహరింగ సభను రద్దు చేసుకుంది.












Click it and Unblock the Notifications