Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

HCU భూవివాదం.. కొనసాగిన బీజేపీ నాయకుల నిర్బంధాలు.. పార్లమెంట్ లో చర్చ, లేటెస్ట్ అప్డేట్స్!

హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూ వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు ఉగాది పండుగ రోజున వందల సంఖ్యలో పోలీసులు క్యాంపస్ లోకి ప్రవేశించి జెసిబిలతో భూములను చదును చేయడంతో రగడ మొదలైంది.

HCU భూవివాదం.. సీఎం భేటీ, పార్లమెంట్ లో చర్చ
ప్రస్తుతం ఈ వ్యవహారంపైన మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో... పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం అయ్యారు. అయితే ఈ భేటీలో HCU భూముల వ్యవహారం, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ లో కూడా హెచ్ సీయూ భూముల వివాదంపై చర్చ జరుగుతుంది. నేడు రాజ్యసభ జీరో అవర్ లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశాన్ని చర్చకు తీసుకువచ్చారు.

HCU land dispute continued detentions of BJP leaders debate in Parliament latest updates

పార్లమెంట్ సాక్షిగా భూముల వేలం ఆపాలని చర్చ
ఆ భూముల వేలం ఆపాలని ఆయన కోరారు. అరుదైన పక్షులు, వృక్ష జాతులు ఉన్నాయని వాటిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది పండుగ నాడు అర్దరాత్రి హెచ్ సీయూ భూముల్లో బుల్డోజర్ లు నడిచాయని పేర్కొన్నారు. భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు యుద్ధం ప్రకటించారని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగటం లేదని, రాహుల్, రేవంత్ రాజ్యాంగం కొనసాగుతుందని అన్నారు. ఉచిత పథకాల అమలు కోసం భూములను అమ్మొద్దని ఆయన సూచించారు.

HCU భూములను సందర్శనకు వెళ్ళే బీజేపీ నాయకుల నిర్బంధం
ఇదిలా ఉంటే ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను సందర్శించేందుకు సిద్ధం అయిన BJP నాయకులను పోలీసులు నిర్బంధించారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం సమీపంలోని ఈ 400 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టె ఉద్దేశ్యంతో ప్రభుత్వ అధికారులు చదును చేసే పనులను చేపట్టారు. భూవివాదం నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించేందుకు బయల్దేరిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలువురు గృహ నిర్బంధం
హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డగించారు. హెచ్‌సీయూ సందర్శనకు పిలుపునిచ్చిన బీజపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వివిధ జిల్లాల నుంచి హెచ్‌సీయూ సందర్శనకు బయల్దేరిన పలు యువజన, విద్యార్థి విభాగాల నాయకులను కూడా పోలీసులు ఎక్కడిక్కడే అడ్డుకున్నారు.

ప్రభుత్వ తీరుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆగ్రహం
కాగా, ప్రభుత్వ తీరును BJP రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి G కిషన్ రెడ్డి ఖండించారు. బుల్డొజర్లను వాడి భూములను చదును చేయటం వల్ల అక్కడి జీవావరణం దెబ్బ తింటోందని, ఈ విషయమై ప్రభుత్వం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందనీ ఆయన ఆరోపించారు. ఈ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలోనూ విద్యార్థుల ఆందోళన
ఈ భూములపై హైకోర్టులో కేసు కూడా విచారణలో ఉందని, భూములను కాపాడాలంటూ... ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ యూనివర్శిటీలో భూములను పరిరక్షించాలని విద్యార్ధులు నినాదాలు చేశారు. భూములతో పాటు అక్కడి వన్య ప్రాణులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉగాది నాడు జేసీబీలను అడ్డుకున్న విద్యార్థులు
ఇక మొన్న ఉగాది పండుగ నాడు హెచ్ సీయూ భూములను చదును చేసే క్రమంలో విద్యార్థులు ఒక్క సరిగా జెసిబిలకు అడ్డు వచ్చి క్యాంపస్ భూములను ప్రైవేటుపరం చేయడానికి వీలు లేదంటూ నిరసన చేశారు. వారిని ఈడ్చుకెళ్ళి అరెస్ట్ లు చేయటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విద్యార్థుల నుండి, అటు ప్రతిపక్ష పార్టీల నుండి వ్యతిరేఖత వ్యక్తం అయ్యింది.

ఉగాదినాడు హెచ్ సీయూ క్యాంపస్ లో ఉద్రిక్తత
ఆదివారం సెలవు కావడం ఉగాది పర్వదినం కావడంతో యూనివర్సిటీలను భూములను చదును చేసి ప్రైవేట్ కి విక్రయించాలని ప్రభుత్వం పని మొదలుపెట్టింది. పోలీసులను రంగంలోకి దింపి జెసిబి లతో చదును ప్రక్రియ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరగగా విద్యార్థుల నినాదాలతో క్యాంపస్ మారుమోగిపోయింది. దీంతో విద్యార్థుల ఆందోళనను కట్టడి చేయడం కోసం పోలీసులు కనిపించిన వారిని కనిపించినట్టు ఈడ్చుకెళ్ళి అరెస్టు చేశారు.

విద్యార్థులు అరెస్ట్
మాదాపూర్, కొల్లూరు, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. మొత్తం 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఉగాది పండుగనాడు పక్కా ప్లాన్ తో హెచ్ సి యు పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని విక్రయించడం కోసం ప్రభుత్వం భూమిని చదును చేసే పని మొదలు పట్టింది. క్యాంపస్ లో ఉన్న వాళ్ళు బయటకు రాకుండా బయట ఉన్న వాళ్ళు క్యాంపస్లోకి రాకుండా జాగ్రత్త పడింది. ఇక క్యాంపస్ లో ఉన్న వాళ్ళు ఆందోళన చేస్తున్న క్రమంలో ఆందోళనకు పాల్పడే వారిని ఎక్కడికిక్కడ అరెస్ట్ చేసి గుడ్డు చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్లకు తరలించింది.

కొనసాగుతున్న సమరం
ఇక ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పైన విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటుపరం చేస్తామంటే ఊరుకోమని వాళ్ళు తెగేసి చెబుతున్నారు. ఇక రాజకీయంగానూ ఈ వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సమరానికి కారణంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+