హెచ్సీయూ భూముల రగడ.. పండుగపూట తీవ్ర ఉద్రిక్తత, విద్యార్థులు అరెస్ట్!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం నాడు ఉగాది పండుగ రోజున వందల సంఖ్యలో పోలీసులు క్యాంపస్ లోకి ప్రవేశించి జెసిబి లతో భూములను చదును చేయడం ప్రారంభించిన క్రమంలో ఈ విషయం తెలిసిన విద్యార్థులు ఒక్కసారిగా జెసిబిలకు అడ్డు వచ్చి క్యాంపస్ భూములను ప్రైవేటుపరం చేయడానికి వీలు లేదంటూ నిరసన కొనసాగించారు.

హెచ్సీయూ భూములను ప్రైవేట్ పరం చేసే ప్లాన్
హెచ్ సియూ లో పోలీసుల చర్యతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా వందల సంఖ్యలో విద్యార్థుల అరెస్టులు కొనసాగాయి.ఆదివారం సెలవు కావడం ఉగాది పర్వదినం కావడంతో యూనివర్సిటీలోని భూములను చదును చేసి ప్రైవేట్ కి విక్రయించాలని ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలో భాగంగా పోలీసులను రంగంలోకి దింపి జెసిబి లతో చదును ప్రక్రియ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.

HCU land issue high tension during ugadi students arrested

క్యాంపస్ ను అధీనంలోకి తీసుకుని పనులు.. అడ్డుకున్న విద్యార్థులు
యూనివర్సిటీలోని అన్ని అంతర్గత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి యూనివర్సిటీని తమ అధీనంలోకి తీసుకొని పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేసి భూములను జెసిబి లతో చదును చేయడం మొదలుపెట్టిన క్రమంలో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరగగా విద్యార్థుల నినాదాలతో క్యాంపస్ మారుమోగిపోయింది.

Take a Poll

కొనసాగిన పోలీసుల అరెస్ట్ లు
విద్యార్థుల ఆందోళనను కట్టడి చేయడం కోసం పోలీసులు కనిపించిన వారిని కనిపించినట్టు ఈడ్చుకెళ్ళి అరెస్టు చేశారు. మాదాపూర్, కొల్లూరు, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. మొత్తం 52మంది విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఆదివారంరోజు ఉగాది పండుగనాడు పక్కా ప్లాన్ తో హెచ్ సి యు పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని విక్రయించడం కోసం ప్రభుత్వం భూమిని చదును చేసే పని మొదలు పట్టింది.

పక్కా ప్లాన్ తో భూముల చదును యత్నం
పండుగ రోజు అందునా ఆదివారం ఎవరూ ఉండరు అన్న ధీమాతో యూనివర్సిటీ ప్రధాన గేటుకు తాళం వేసి లోపల భూములను చదును చేసే ప్రయత్నం చేసింది. క్యాంపస్ లో ఉన్న వాళ్ళు బయటకు రాకుండా బయట ఉన్న వాళ్ళు క్యాంపస్లోకి రాకుండా జాగ్రత్త పడింది. ఇక క్యాంపస్ లో ఉన్న వాళ్ళు ఆందోళన చేస్తున్న క్రమంలో ఆందోళనకు పాల్పడే వారిని ఎక్కడికిక్కడ అరెస్ట్ చేసి గుట్టు చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్లకు తరలించింది.

విద్యార్థుల ఆందోళన
ఇక ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పైన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటుపరం చేస్తామంటే ఊరుకోమని వాళ్ళు తెగేసి చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+