Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ సూసైడ్‌కు రాజకీయ రంగు: దత్తాత్రేయపై కవిత ఆగ్రహం

హైదరాబాద్: కేంద్రమంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ పైన తెరాస నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దత్తాత్రేయ పూర్తిగా దిగజారి విద్యార్థుల రాజకీయాల్లో తలదూర్చారని ఆరోపించారు.

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య విషయమై ఆమె స్పందించారు. ఈ విషయం చాలాకాలంగా తమ ముందు ఉందని, అయితే విద్యార్థుల వివాదాల్లో రాజకీయ నాయకులు తలదూర్చడం సరికాదని భావించి మౌనంగా ఉన్నామన్నారు.

కానీ దత్తాత్రేయ బీజేపీ విద్యార్థి విభాగానికి అనుకూలంగా పని చేసి, దళిత విద్యార్థులకు వ్యతిరేకంగా వైస్ ఛాన్సులర్ పైన ఒత్తిడి తెచ్చేలా లేఖ రాశారని, ఆ లేఖనే ఇప్పుడు ఓ విద్యార్థి ఆత్మహత్యకు కారణమైందన్నారు.

ఇప్పటికైనా అకారణంగా విధించిన సస్పెన్షన్‌ను మిగిలిన నలుగురు విద్యార్థులపై ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల తీరు సరికాదన్నారు. ఈ ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

కాగా, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. తాను సభ్యుడిగా ఉన్న ఏఎస్‌ఏ బ్యానర్‌తోనే అతను తన స్నేహితుడి గదిలో ఉరి వేసుకొన్నాడు.

విశ్వవిద్యాలయం తీసుకున్న క్రమశిక్షణ చర్యలే రోహిత్‌ మృతికి కారణమని.. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీతోపాటు వర్సిటీ ఉపకులపతి పొదిలె అప్పారావు ఈ ఘటనకు బాధ్యులని దళితవాద సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే తన మృతికి ఎవరి మాటలు, చర్యలూ కారణం కాదని రోహిత్‌ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. లేఖలో ఒక పేరా మొత్తం కొట్టివేసి అక్కడ కొట్టివేసింది తానే అన్నట్లు సంతకమూ చేశారు.

HCU PhD student Rohith Vemula commits suicide, MP Kavitha lashes out at Dattatreya

వివాదం ఇలా...

ముజఫర్‌ నగర్‌ అల్లర్లు అనే డాక్యుమెంటరీ ప్రదర్శనను గతేడాది ఢిల్లీలో ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హెచ్‌సీయూలో ఏఎస్‌ఏ ఆగస్టు 3న నిరసన చేపట్టింది. దీనిపై ఏబీవీపీ నాయకుడు సుశీల్‌ ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌ చేశాడు. దీంతో విద్యార్థులకు సుశీల్‌కు వాగ్వాదం జరిగిందని విద్యార్థులు తెలిపారు.

తనపై దాడి జరిగిందన్న సుశీల్‌ ఫిర్యాదుతో దళిత విద్యార్థులపై పోలీసు కేసు నమోదైంది. వర్సిటీ యాజమాన్యం దాడికి పాల్పడ్డారంటూ పీహెచ్‌డీ చేస్తున్న ఐదుగురు విద్యార్థులు దొంత ప్రశాంత్‌, రోహిత్‌ వేముల, చెముడుగుంట శేషయ్య, పెద్దపూడి విజయ్‌, సుంకున్నలను సెమిస్టర్‌పాటు తొలగిస్తూ ప్రకటన చేసింది.

ఏఎస్‌ఏ అందోళనతో బహిష్కరణ ఎత్తివేసి మరో కమిటీ నివేదిక ఆధారంగా.. తరగతులకు హాజరుకావడం, గ్రంథాలయానికి వెళ్లడం మినహా వసతిగృహాల్లో ఉండడం, విద్యార్థి ఎన్నికల్లో పాల్గొనడం చేయకూడదని ఆంక్షలు విధించారు. ఆ వివాదమే రోహిత్‌ మృతికి కారణమైందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనలకు ముందు వర్సిటీలో కొందరు విద్యార్థులు జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని, తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ.. కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతిఇరానీకి లేఖ రాశారు. తీవ్రవాది యాకూబ్ మెమన్‌ ఉరిశిక్షకు నిరసనగా హెచ్‌సీయూలో కొందరు విద్యార్థులు కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యలో ఆయన ఈ లేఖ రాసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+