14వ అంతస్తు నుంచి దూకి.. హెచ్‌సీయూ స్కాలర్‌ ఆత్మహత్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ చేస్తోన్న విశాల్ టాండన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగుండ్లలోని అపర్ణ అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుంచి శనివారం కిందికి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

హైదరాబాద్: ప్రఖ్యాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ చేస్తోన్న విశాల్ టాండన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగుండ్లలోని అపర్ణ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ అపార్ట్ మెంట్ లోనే నివసిస్తున్న టాండన్ శనివారం సాయంత్రం అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుంచి కిందికి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. హెచ్‌సీయూలో జనరల్ స్టడీస్ లో పీహెచ్‌డీ చేస్తోన్న విశాల్ టాండన్ తన తల్లితో కలిసి నల్లగండ్లలోని అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు.

HCU Student commits suicide at Chandanagar in Hyderabad

అతడి తల్లి ముంబై వెళ్లగా, శనివారం ఇంట్లో విశాల్ ఒంటరిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మృతుడి స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం ప్రాంతమని, మరణించే ముందు అతడు తన కుటుంబ సభ్యులకు మెయిల్ పంపినట్లు గుర్తించామని చందానగర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+