హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్శిటీలోనే ఉంటానని రోహిత్ తల్లి: పరిశోధక విద్యార్థి సూసైడ్ నోట్ ఇదీ..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ సూసైడ్ నోట్ హృదయాన్ని కలచివేసే విధంగా ఉంది. ఎబివిపి విద్యార్థులకు, దళిత విద్యార్థులకు మధ్య తీవ్ర వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తోంది.

కాగా, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వివాదంపై విచారణ జరపడానికి వేసిన కమిటీలో దళిత అధ్యాపకులు లేకపోవడాన్ని కూడా తప్పు పడుతున్నారు. అగ్ర కులాలకు చెందినవారు విచారణ కమిటీలో ఉండడం వల్లనే విద్యార్థుల సస్పెన్షన్‌కు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు.

పరిశోధక విద్యార్థి ఆత్మహత్య: అఫ్జల్‌గురు ఉరితీతకు లింకేమిటి, అసలేం జరిగింది?పరిశోధక విద్యార్థి ఆత్మహత్య: అఫ్జల్‌గురు ఉరితీతకు లింకేమిటి, అసలేం జరిగింది?

తన కుమారుడి ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. వీసీ సమాధానం చెప్పేవరకు తాను యూనివర్శిటి నుంచి వెళ్లబోనని అన్నారు. వీసీ వచ్చే వరకు రోహిత్ మృతదేహానికి పోస్టుమార్టం చేయరాదని ఆమె అన్నారు.

తాను టైలరింగ్ చేస్తూ తన కుమారుడిని చదివించానని, తన కొడుకుని సస్పెండ్ చేసి మనస్తాపానికి గురి చేశారని ఆమె అన్నారు.

HCU student death: The suicide note

సూసైడ్‌నోట్‌ వివరాలు ఇవీ...

ఆత్మహత్యకు పాల్పడే ముందు రోహిత్ ఆంగ్లంలో ఐదు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. శరీరానికి, హృదయానికీ మధ్య ఘర్షణ జరుగుతోందని ఆ నోట్‌లో రాశాడు. మనిషిని మనిషిగా చూడడం లేదని, పుట్టుక తీరునే చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

రోహిత్ ఆత్మహత్య: దత్తాత్రేయ సహా 4గురిపై కేసు, బృందాన్ని పంపిన స్మృతిరోహిత్ ఆత్మహత్య: దత్తాత్రేయ సహా 4గురిపై కేసు, బృందాన్ని పంపిన స్మృతి

పరిశోధక విద్యార్థి ఆత్మహత్య: అట్టుడుకుతున్న హెచ్‌సియుపరిశోధక విద్యార్థి ఆత్మహత్య: అట్టుడుకుతున్న హెచ్‌సియు

రోహిత ఆత్మహత్య చేసుకునే ముందు తన చావుకు ఎవరూ కారణం కాదంటూ ఐదు పేజీల లేఖ ఆంగ్లంలో రాశాడు. దాని సారాంశం క్లుప్తంగా.. ‘‘నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. ఎవరూ ప్రేరేపించలేదు. నన్ను ఎవరూ వేధించలేదు. ఇది నేను స్వయంగా తీసుకున్న నిర్ణయం. దయచేసి నా మిత్రులను, శత్రువులను ఇబ్బంది పెట్టవద్దు. నన్ను స్వార్థపరుడని అనుకోవద్దు. చనిపోయిన తరువాత మీరు నా గురించి ఏమనుకున్నా పట్టించుకోను. మరణాంతరం పునర్జజన్మలపై నాకు విశ్వాసం లేదు. దయ్యాలు, ఆత్మల గురించి పట్టించుకోను. ఎవరినీ ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. నాకు ఏడు నెలల ఫెలోషిప్‌ 1.75 లక్షలు రావాలి. ఈ డబ్బును మా కుటుంబానికి అందజేయగలరు. రామ్‌జీకి 40 వేలు ఇవ్వాలి. అతను నన్ను ఎప్పుడూ డబ్బు అడగలేదు. ఫెలోషిప్‌ నుంచి డబ్బు చెల్లించగలరు. నా అంత్యక్రియలు చాలా ప్రశాంతంగా నిర్వహించండి. నా గురించి కన్నీళ్లు పెట్టుకోవద్దు''.

English summary
Hyderabad Central University (HCU) student Rohit suicide note found. His mother Radhika blames VC for Rohit's suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X