పెగ్గు పడితే పోలీసైపోతాడు.. అందిన కాడికి దోచేస్తాడు..! దొంగ వెధవ..!!
హైదరాబాద్ : కడుపుకు అన్నం తినే మనిషికి 64 కళల్లో ఏదో ఒక కళలో ప్రవేశం ఉంటుంది అంటారు. మానవాతీతుడు, అవలక్షణాలు ఉన్న వాడికే 64కళల్లో ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది అంటారు. హైదరాబాద్ నగరం నాగోలులో ఇలాంటి సకలకళా వల్లభుడి లీలలు వెసుగులోకి వచ్చాయి. అతగాడు గతంలో ఆటోడ్రైవర్... కానీ.. తాగితే పోలీసవుతాడు. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగి దోచుకుంటాడు. ఈ నకిలీ పోలీసు బారినపడి ఎల్బీనగర్ ఠాణా పరిధిలో చాలామంది తమ నగలు, నగదు సమర్పించుకున్నారు.
Recommended Video

ఎట్టకేలకు నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ నిందితుడికి సంబందించిన ఆశ్చర్యకర వివరాలను విలేకరులకు వెల్లడించారు.
నల్గొండ జిల్లా డిండి మండలం దేవత్‌పల్లి తండాకు చెందిన ఇరవై ఏడు సంవత్సరాల రమావత్ నరేష్ గతంలో ఎల్బీనగర్ కేంద్రంగా ఆటో నడిపేవాడు. బెదిరించి నగలు దోచుకున్న ఘటనల్లో జైలుకు వెళ్లొచ్చాడు. తాజాగా మళ్లీ దోపిడీలకు తెరలేపాడు. ద్విచక్రవాహనంపై బస్టాపు వద్దకు వచ్చి వృద్ధులను లక్ష్యంగా చేసుకొని, దుర్భాషలతో భయభ్రాంతులకు గురిచేసి స్టేషనుకు పదమంటూ ఆటో ఎక్కిస్తాడు. ఒంటిపై నగలు ఎందుకంటూ లాక్కుంటాడు.

ఆ తర్వాత ఠాణాకు అవసరంలేదంటూ నగలు వారికే ఇచ్చి వెళ్లిపోతాడు. తీరా చూసుకుంటే దోచిన సొత్తులో కొంతమాత్రమే ఉండటం చూసి బాధితులు బావురుమంటారు. ఇతని బారినపడినవారిలో పలువురు విశ్రాంత ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. ఎట్టకేలకు సీసీ టీవీ ఫుటేజీల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్టుచేసి జైలుకు తరలించారు. అతని వద్ద 10తులాల బంగారం, ఓ బైకు స్వాధీనం చేసుకున్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
Free Ipl Tickets: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు -లింక్ షేర్ చేసిన బెంగళూరు పోలీసులు..! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications