అతను సామాన్యుడు కాదు, 8 రాష్ట్రాల్లో 88 కేసులు
హైదరాబాద్ :ఆపోలో ఆసుపత్రిలో వైద్యుడిగా నమ్మించి ఆడీ కారుతో ఉడాయించిన వంశీకృష్ణ కు పెద్ద చరిత్రే ఉంది. మోసాలు, దొంగతనాలు చేసిన చరిత్ర ఆయనది. ఉన్నత విద్యను అభ్యసించినా తన పద్దతులను మార్చుకోలేదు. దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడు.
క్రికెట్ బెట్టింగ్ లు,గుర్రపు పందెలు, కార్ల దొంగతనాలకు పాల్పడగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడు. తాజాగా హైద్రాబాద్ లో ఆడీ కార్ల షోరూమ్ లో డాక్టర్ గా పరిచయం చేసుకొని టెస్ట్ డ్రైవ్ కోసమని వచ్చి కారుతో ఉడాయించాడు.మోసం చేసేందుకు రకరకాల అవతారాలు ఎత్తడం ఆయనకు అలవాటుగా పోలీసులు గుర్తించారు.

కోట్లాది రూపాయాల భూమి కన్పిస్తే ఎంపికి బందువుగా మారుతాడు, నిరుద్యోగులకు ఉద్యొగాలు ఇచ్చే కంపెనీ యజమానిగా మారుతాడు. క్రికెట్ లో బెట్టింగ్ లకు పాల్పడి లక్షలు సంపాదించాడు. గుర్రపు పందెల్లో కూడ విపరీతంగా డబ్బులు సంపాదించాడు.వాటిని తిరిగి బెట్టింగ్ లోనే పోగోట్టుకొన్నాడు. దొంగిలించిన కార్లను చోరీ చేసి వాటిని అమ్మివేశాడు.
తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన వెంకటరమణ అలియాస్ వంశీకృస్ణ గుర్తించారు.ఇ:టర్ చదివే సమయంలోనే నేరాలను చేయడం ప్రారంభించాడు. 2009లో పార్వతీపురంలో మారుతీకారును చోరిచేసి విక్రయించాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్ళాడు. కాని, బుద్ది మారలేదు. జైలు నుండి వచ్చిన తర్వాత ఎంటెక్ పూర్తి చేశాడు. అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చినా మారలేదు.ఉద్యోగాలు చేయలేదు.
పేర్లు మార్చుకొంటూ మోసాలు
గుంటూరులో రెండు కార్లను దొంగిలించి విక్రయించాడు.ఈ కేసుల్లో పోలీసులకు దొరకకుండా తప్పించుకొన్నాడు.దొంగతనాలు, మోసం చేస్తూ సంపాదించిన డబ్బుతో బెంగుళూరులో జల్సా చేసేవాడు.గుర్రపు పందెలు, క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడేవాడు.ఫేస్ బుక్ లో అమ్మాయిలను పరిచయం చేసుకొని మోసం చేసేవాడు. డబ్బున్న యువతిని బొమ్మ తుపాకితో బెదిరించి కోటి రూపాయాలను వసూలు చేశాడు.సాప్ట్ వేర్ కంపెనీనీ పెట్టి 230 మందికి 2.5 కోట్లను ఇవ్వకుండా ముంచాడు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశాడు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు.
గౌతం రెడ్డి, వంశీకృష్ణ చౌదరి,శ్రవణ్, తదితర పేర్లతో మోసాలు చేసేవాడు. 8 రాష్ట్రాల్లో ఈయన 88 పైా నేరాలకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.తాజాగా ఆడీ కార్ల షోరూమ్ లో ట్రయల్ కు వెళ్తానని చెప్పి ఆడీ కారుతో ఉడాయించాడు వంశీకృష్ణ. ఎట్టకేలకు ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశాడరు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications