వ్యక్తిగత ఇబ్బందులు వస్తాయని అనుకోలేదు: రేవంత్ రెడ్డి భార్య గీత
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తున్నప్పుడు రాజకీయపరమైన ఇబ్బందులు వస్తాయని అనుకున్నాం గానీ వ్యక్తిగత ఇబ్బందులు వస్తాయని ఊహించలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి సతీమణి గీత అన్నారు. రేవంత్ రెడ్డికి బెయిల్ మంజురైన తర్వాత ఆమె మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు.
చాలా మంది తమకు మద్దతు పలికారని ఆమె చెప్పారు. తమను అదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఝతలు తెలుపుతున్నామని ఆమె చెప్పారు. ప్రజా సమస్యలపై రేవంత్ రోడ్డు దూకుడు తగ్గించబోరని ఆమె విశ్వాసం వ్యక్తం చేసఆరు. దెబ్బ తగిలినప్పుడే మనిషి రాటు దేలుతాడని అన్నారు. బలం అందించడానికి కాకాపోయినా బలహీనపడకుండా తాను రేవంత్ రెడ్డిని చూసుకుంటానని ఆమె చెప్పారు.

రాజకీయాల్లో అటుపోట్లు సహజమని, వాటిని తట్టుకుని నిలబడాలని ఆమె అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోరాటం చేస్తారనే పేరు రేవంత్ రెడ్డికి ఉందని, ఆ పేరును రేవంత్ రెడ్డి నిలబెట్టుకుంటారని గీత అన్నారు.
ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతారని తాను అనుకోవడం లేదని, సమస్య వచ్చింది దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది చూసుకుంటామని అన్నారు. తాను మాత్రమే కాకుండా తమ కుటుంబ సభ్యులందరూ రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తారని ఆమె చెప్పారు. రేవంత్ రెడ్డి దూకుడుగా కనిపించినా సున్నిత మనస్కుడని గీత అన్నారు. తమ వివాహమైన తర్వాత రేవంత్ రెడ్డి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంతకాలం తమ కుటుంబానికి దూరంగా లేరని ఆమె చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications