మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు..!! ఈటల సంచలన వ్యాఖ్యలు

వైద్యశాఖ మంత్రి ఈటల రాజెందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇచ్చిన మంత్రిపదవి ఎవరి బిక్ష కాదని అన్నారు. బీసీ కోటాలో ఎప్పుడు మంత్రి పదవి ఆశించలేదని చెప్పిన ఈటల, తాను టీఆర్ఎస్‌లో పార్టీలోకి మధ్యలో రాలేదని అన్నారు. తాను కూడ గులాబి జెండా నిర్మాణంలో భాగస్వామినని ఉద్వేగంగా మాట్లాడారు. టీఆర్ఎస్ జెండా ఓనర్లలో తాను ఒకడినని అన్నారు. ఇక తనపై వచ్చిన చిల్లర ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఉద్యమ సయమంలో చంపుతామని బెదిరిస్తేనే ఎదరురెళ్లిన వాడినని అన్నారు.

టీఆర్ఎస్ మంత్రివర్గంలో లుకలుకలు బయటపడ్డాయి. గత కొద్దిరోజులుగా ఈటల రాజెందర్ అసంతృప్తిగా ఉంటున్నాడని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రివర్గ ప్రక్షాళన చేస్తారనే సంకేతాలు వెలువడిన సంధర్భంలో ఈటల వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Health Minister Etela Rajender made sensational remarks,

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త రెవెన్యు చట్టం ఈటల లీకులు ఇచ్చారనే ఆరోపణలు ఎదుర్కోన్నాడు. ఈ లీకులతోనే అటు సీఎం కేసీర్‌కు ఈటల రాజెందర్‌కు మధ్య బేదాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయన తన అసంతృప్తిని వెల్లగక్కినట్టు తెలుస్తోంది. కాగా హుజురాబాద్‌లోని కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+