మత్తయ్యకు ఊరట: అరెస్టుపై స్టే కొనసాగింపు, విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడు జెరూసెలం మత్తయ్య స్క్వాష్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి (గురువారానికి) వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మత్తయ్య అరెస్టుపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన కౌంటర్‌పై కూడా విచారణ రేపటికి వాయిదా పడింది.
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు జెరూసెలం మత్తయ్య స్క్వాష్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధవారం సాయంత్రం మూడున్నర గంటలకు వాయిదా వేసింది. ఓటుకు నోటు స్కాం కేసులో ఫిర్యాదిదారుడు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నాల్గవ నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్‌ను విచారించరాదని, ఈ కేసు విచారణ నుంచి వైదొలగాలని న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్‌రావును అభ్యర్ధించారు. ఈ నెల 18వ తేదీన మత్తయ్య దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ విచారణ, అంతకు ముందు పరిణామాలు చూస్తే తనకు సందేహం కలుగుతోందని అన్నారు.

ఈ నెల 18వ తేదీన నిందితుడు మత్తయ్య తరఫున హైకోర్టులో ఏపికి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడం అసాధారణమన్నారు. ఒక కేసులో పరారీలో ఉన్న నిందితుడి తరఫున ఒక పబ్లిక్‌ప్రాసిక్యూటర్ వాదించడం నేర న్యాయ వ్యవస్ధలో అసాధారణంగా ఉందన్నారు. ఈ స్థితిలో స్క్వాష్ పిటిషన్ విచారణకు సంబంధించి తనకు భయాలు ఉన్నాయని, అందుకే ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలని స్టీఫెన్‌సన్ కోర్టును అభ్యర్ధించారు.
కాగా, మత్తయ్యను విచారిస్తేనే కేసు ఒక కొలిక్కి వస్తుందని తెలిపిందని, అందుచేత వెంటనే తమకు లొంగిపోవాలని మత్తయ్యను ఆదేశించాలని ఎసిబి హైకోర్టును కోరింది. మత్తయ్య వివరాలను ఏపి ప్రభుత్వం తెలియచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది.












Click it and Unblock the Notifications