ఆ మాటలెందుకు? మంత్రి ముందే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పోదెం వీరయ్య తీవ్ర వాగ్వాదం (వీడియో)

ఖమ్మం: పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య సభా వేదికపైనే తీవ్ర వాగ్వాదం జరిగింది. నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకుంటూ ఇద్దరు నేతలు ఆవేశంతో ఊగిపోయారు. ఇదంతా చూసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు షాకయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని లక్ష్మినగరంలో తునికి ఆకుల సేకరణ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే, రేగా కాంతారావు ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. వచ్చే ఎన్నికల్లో భద్రాచలంలో గెలువబోయేది బీఆర్ఎస్ అంటూ రేగా కాంతారావు వ్యాఖ్యానించారు.

regakantharaoandpodemveeraiah

ఈ క్రమంలో ఆయనను పోదెం వీరయ్య అడ్డుకున్నారు. కాంతారావు వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్నీ పార్టీ కార్యక్రమంగా ఎలా చేస్తారని వీరయ్య ప్రశ్నించారు. దీంతో ఇద్దరి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు తమ కుర్చీల నుంచి లేచి వాగ్వాదం చేసుకోవడంతోపాటు కొట్టుకున్నంత పనిచేశారు.

నువ్వెంత అంటే నువ్తెంత అంటూ ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు.
వెంటనే పోలీసు అధికారులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎదుటే ఇదంతా జరగడం గమనార్హం. ఆ తర్వాత ఇద్దరు నేతలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సర్ది చెప్పారు. ఆ తర్వాత సమావేశం సజావుగా సాగింది.

భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న పోడెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే ఎన్నికల్లో భద్రాచలంలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ముందే ఆనడంతో పోడెం వీరయ్య ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+