సొంత పార్టీలోనే తీవ్ర పోటీ.!కాలుదువ్వుకుంటున్న గులాబీ నేతలు.!రసవత్తరంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.!

హైదరాబాద్ : తెలంగాణలో ఎండల వేడి కన్నా రాజకీయ వేడి కాకరేపుతోంది. గులాబీ నేతల్లో నెలకొన్న అంతర్గత పోటీ వల్ల పార్టీ అదిష్టానం ఉక్కిబిక్కిరవుతున్నట్టు సమాచారం. సొంత పార్టీలోనే విపరీతమైన పోటీ నెలకొన్నట్టు కూడా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ప్రతి నియోజక వర్గంలో ప్రధమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నేతల మద్య పైకి సఖ్యత కనిపిస్తున్నా లోలోన మాత్రం తీవ్రమైన కసితో ఉన్నట్టు ఆయా నియోజక వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అధికార గులాబీ పార్టీలో నెలకొన్న తీవ్ర అంతర్గత పోటీ..
తెలంగాణ ఉద్యమంలో నిఖార్సయిన ఉద్యమకారులను కాకుండా పక్క పార్టీల నుండి వలస వచ్చిన వారికి రాజకీయ పదవులు కట్టబెట్టారని, గత రెండు దఫాలుగా ఇదే జరిగిందని, ఈ సారి మాత్రం నిజమైన ఉద్యమకారులకు ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వాల్సిందేనన్న కోణంలో గులాబీ దళపతి చంద్రశేఖర్ రావు మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్టు, సొంత పార్టీలోనే ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అనే తీవ్ర పోటీ కూడా నెలకొందనే చర్చ జరుగుతోంది.

 brspartyleaders

రసవత్తరంగా మారనున్న సార్వత్రిక ఎన్నికలు...
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీలో పార్టీ అద్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గీసిన లక్ష్మణ రేఖను ఏ నాయకుడు కూడా అతిక్రమించలేదు. కానీ రాబోవు సాధారణ ఎన్నికలు అందుకు భిన్నంగా పరిణమించబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన సిసలైన ఉద్యమకారులను కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చి రాజకీయ లబ్ది పొందుతున్న వారికి చెక్ పెట్టాలని ఉద్యమకారులు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకే నియోజకవర్గంలో పోటీ పడుతున్న సొంత పార్టీ నేతలు..
ఈ దిశలోనే కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో రాజకీయ వేడి ప్రకంపనలు సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మద్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు నాదే అంటే నాదే అనే స్ధాయిలో బీ ఫామ్ ఫైట్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గులాబీ వనంలో ఉద్యమ తెలంగాణ బ్యాచ్ (యూటీ బ్యాచ్), బంగారు తెలంగాణ బ్యాచ్ (బీటీ బ్యాచ్) అని రెండు గ్రూపులుగా విడిపోయి వచ్చే ఎన్నికల్లో కీలక ప్రభావం చూపాలని యూటీ బ్యాచ్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది.

 brspartyleaders 1

చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గండం..
ఇలాగే జరిగితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేపీ వివేకానంద టికెట్ గల్లంతయ్యే అవకాశం లేకపోలేదు. ఒక్క కేపీ వివేకా టికెట్ మాత్రమే కాకుండా నగరంతో పాటు నగర శివార్లలో ఉన్న అన్ని నియోజక వర్గాల్లో చాలా వరకూ ఇదే తిరుగుబాటు రాజకీయం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. చాపకింద నీరులా పరిణమించిన ఈ అంశాన్ని మరి గులాబీ దళపతి ఎంతవరకూ పరిష్కరిస్తారు అనే అంశంపై కీలక చర్చ జరుగుతోంది. యూటీ, బీటీ నేతల మద్య నెలకొన్న సమస్యలను ఎంత చాకచక్యంగా పరిష్కరిస్తారనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+