హైదరాబాద్ సిటీలో మళ్లీ దంచికొట్టిన వాన: రోడ్లు జలమయం, అలర్ట్

హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం దంచికొట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దీంతో విధులు ముగించుకుని నివాసాలకు బయల్దేరిన ఉద్యోగులు, విద్యా సంస్థల నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుండపోత వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనాదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మొదట మేడ్చల్‌​లో ప్రారంభమైన వర్షం హైదరాబాద్ నగరమంతటా విస్తరించింది. సికింద్రాబాద్, మియాపూర్‌, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నారాయణగూడ, కోఠి, దిల్​‌సుఖ్​‌నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌​మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వరదనీరుగా చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Heavy rain again in Hyderabad city

నాంపల్లిలో భారీ వర్షానికి నాంపల్లి స్టేషన్ రోడ్​లో రహదారిపై భారీగా చేరిన నీరు చేరింది. ఫలితంగా షాపులలోకి నీరు చేరడంతో యజమానులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్ నెక్టర్ గార్డెన్స్ దగ్గర స్వల్ప సమయంలోనే కురిసిన భారీ వర్షంతో రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కార్యాలయాలు, విద్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు, విద్యార్థులు అంతా ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల రహదారులపైకి మోకాలు లోతు నీరు రావడంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. శని, ఆదివారాలు సెలవు కావడంతో సొంతూళ్లకు వెళ్లాలని బయలుదేరిన వారు కూడా వర్షంలో తడిసి ముద్దయ్యారు.

మరోవైపు, భారీవర్షంతో రోడ్లపైకి వరద నీరు చేరడంతో జీహెచ్​ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలిచిన చోట నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులు రోడ్లపై నెమ్మదిగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసరమైన పనులు ఉన్నవారు తప్ప మిగతా వారు ఇంట్లోనే ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు, ఇతర జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

మరో మూడు రోజులు భారీ వర్షాలు

పశ్చిమ, మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం 8:30 గంటలకు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతుందని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వద్ద సెప్టెంబర్ 9న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

శుక్ర, శనివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు వర్షాలతో పాటు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

అంతేగాక, సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 9న అతి భారీ వర్షాలు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాలు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. 10న అతిభారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

ఇక, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. కాగా, వాయుగుండం ముప్పు మాత్రం తెలుగు రాష్ట్రాలకు తప్పిందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+