వణుకుతున్న హైదరాబాద్: జలమయం, కొట్టుకుపోయిన వాహనాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరం వానకు అతలాకుతలంగా మారింది. శుక్రవారం సాయంంత్రం నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరం వానకు అతలాకుతలంగా మారింది. శుక్రవారం సాయంంత్రం నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటికి వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి.
హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు నీరు చేరింది. ఎమర్జెన్సీ బృందాలను జిహెచ్ఎంసి రంగంలోకి దింపింది. హైదరాబాదులోని బంజారాహిల్స్, జూబ్లీ హిలస్, మెహిదీపట్నం, దిల్‌షుక్‌నగర్, మలక్‌పేట, పంజగుట్ట, అమీర్ పేట, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Recommended Video


పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దాంతో పలు ప్రాంతాలు చీకటమయం అయ్యాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో మోండా మార్కెట్, బేగంపేట, ప్యాట్నీ, రాంగోపాల్‌పేట, మారేడ్‌పల్లి, చిలకలగూడ, పార్సీగుట్ట, అడ్డగుట్ట, తుకారాంగేట్, తిరుమలగిరి, అల్వాల్, యాప్రాల్, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది.
హబీబ్‌నగర్ నాలా ఉప్పొంగుతోంది. వినాయక చవితి సెలవు దినం కావడంతో చాలా మంది ఇళ్లలోనే ఉండిపోయారు. దానివల్ల కొంత మేరకు ట్రాఫిక్ సమస్య తగ్గింది.












Click it and Unblock the Notifications